
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Business Ideas: రైతులకు చక్కటి లాభాలు కావాలి అంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అంటే వ్యవసాయాన్ని మించిన మరొక మార్గం లేదు అని చెప్పవచ్చు. నేల తల్లిని నమ్ముకున్న వాడికి ఎప్పుడు మోసం జరగదు. సరైన పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్నట్లయితే వ్యవసాయం ని మించిన ఆదాయ మార్గం లేదు అని చెప్పవచ్చు. కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందినటువంటి లోహిత్ శెట్టి అనే ఒక రైతు దక్షిణ కన్నడ జిల్లా, పెరడకా గ్రామంలో మాంగోస్టీన్ అనే అరుదైన పండ్ల జాతి మొక్కలతో వ్యవసాయం చేసి ప్రస్తుతం చక్కటి ఆదాయం పొందుతున్నాడు. ఈ మ్యాంగో స్టీన్ అనే పండు కేజీ ధర 650 రూపాయల వరకు పలుకుతోంది. విదేశాల్లో మాత్రమే లభించే ఈ పండును ఫైవ్ స్టార్ హోటల్స్, అలాగే అరుదైన ఎగ్జోటిక్ పండ్ల మార్కెట్లలో భారీ డిమాండ్ కలిగి ఉంది. వీటిని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. 2006 సంవత్సరంలో లోహిత్ శెట్టి తాను రెగ్యులర్ గా చేసే రబ్బర్ పంట, వక్క పంట సాగులో ఆదాయం తగ్గడంతో, ఇతర డిమాండ్ కలిగినటువంటి పంటలను పండించాలని నిర్ణయం తీసుకొని కేరళ వెళ్లి అక్కడ మాంగోస్టీన్, రాంబుటాన్ వంటి ఎక్సోటిక్ (అరుదైన) పండ్ల గిరాకీని దృష్టిలో ఉంచుకొని తనకు ఉన్నటువంటి వక్క పిక్కల తోటలో 50 మ్యాంగోస్టిన్ చెట్లను అంతర పంటగా వేసి చూశాడు. నిజానికి మ్యాంగోస్టింగ్ చెట్లకు ఎక్కువగా ఎండ అవసరం లేదు. కనుక కొబ్బరి చెట్లలా పెరిగే వక్క పిక్కల తోటలో అంతర పంటగా వేయడం వల్ల, మ్యాంగోస్టింగ్ చెట్లకు నేరుగా ఎండ తాకలేదు