ఈ ఆదాయాల
Actor ProfilePolitician

ఈ ఆదాయాల

Total News1
Movie Updates0
Sources1
ఈ ఆదాయాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు.. టాక్స్ పేయర్లు తెలుసుకోవాల్సినవి ఇవే
Samayam Telugu15 Jun 2026
ఈ ఆదాయాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు.. టాక్స్ పేయర్లు తెలుసుకోవాల్సినవి ఇవే

Agricultural Income Tax Freeభారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. ఇక్కడ ఆదాయపు పన్ను చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇందులో పాత లేదా కొత్త పన్ను విధానం అమల్లో ఉండగా ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. వాటి పన్ను శ్లాబులకు అనుగుణంగా టాక్స్ పడుతుంది. ఇక్కడ పన్ను తగ్గించుకునేందుకు వీటిల్లో వెసులుబాట్లు ఉంటాయి. పాత పన్ను విధానంలో టాక్స్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలతో కలిపి రూ. 5.50 లక్షల వరకు మాత్రమే పన్ను పడదు. తర్వాత టాక్స్ శ్లాబులు అధికంగా ఉంటాయి. కానీ ఇక్కడ పన్ను మినహాయింపు పొందేందుకు చాలా ఆప్షన్లు ఉంటాయి. పెట్టుబడులు, హెల్త్ ఇన్సూరెన్స్, హోం లోన్, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ఇలా చాలా కేసుల్లో టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.కొత్త పన్ను విధానంలో చూస్తే మాత్రం ఇక్కడ వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలుగా ఉండగా.. రూ .12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ మినహాయింపులు మాత్రం తక్కువ. చాాల మంది టాక్స్ అంటే వెంటనే సెక్షన్ 80C, HRA, NPS ఈ డిడక్షన్ల గురించే ఆలోచిస్తారు. కానీ భారత ఆదాయ పన్ను చట్టంలో కొన్ని ఆదాయాలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక్కడ వీటిపై టాక్స్ చెల్లించనక్కర్లేదు. 5 టాక్స్ ఫ్రీ ఇన్‌కం సోర్సెస్ గురించి చూద్దాం.బంధువుల నుంచి వచ్చే బహుమతులు.. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీ మణులు, అత్తమామలు వంటి చట్టం గుర్తించిన బంధువుల నుంచి అందుకునే నగదు లేదా ఇతర బహుమతులపై ఎలాంటి టాక్స్ ఉండదు. అలా అనీ వీటిని విక్రయిస్తే ఉండదనుకోవద్దు. విక్రయించిన సమయంలో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వంటివి పడతాయి. ఇది వేరే కేటగిరీలోకి వస్తుంది. అంటే