ఇసకపట్నం' రివ్యూ
Actor ProfileCelebrity

ఇసకపట్నం' రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇసకపట్నం' రివ్యూ
Samayam Telugu1 Sept 2026
ఇసకపట్నం' రివ్యూ

ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా చేసిన సిరీస్ ‘ఇసకపట్నం’. ఈ సిరీస్‌లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్, నరేష్ అగస్త్య, రాజా చెంబోలు, సుధాకర్ కొమాకుల వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అంటూ ‘ఇసకపట్నం’పై అంచనాలు పెంచేశారు. ప్రమోషన్స్ టైంలోనూ ఐశ్వర్య రాజేష్ చెప్పిన విషయాలు సిరీస్ మీద ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కథ ఇసకపట్నం అనే సిటీని నాయుడు (సముద్రఖని) తన కంట్రోల్‌లో పెట్టుకుంటాడు. చిన్నారావు (రాజీవ్ కనకాల)ని చంపి నాయకుడిగా ఎదుగుతాడు నాయుడు. బర్మా నుంచి వలస కూలీగా వచ్చిన పోతన (జ్వాలా కోటి) ఇక్కడ అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ చిన్నా రావు దగ్గర నుంచి నాయుడు వరకు వారికి నీడలానే బతుకుతుంటాడు. ఇసకపట్నంలో అధికారం తనదే అవ్వాలని ప్రతాప్ వర్మ (రవి వర్మ) కూడా ప్రయత్నిస్తుంటాడు. ఇక నాయుడు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్) మాత్రం తండ్రి అక్రమాలు, అన్యాయాల్ని ఎదురిస్తూ ఎన్జీవో కోసం పని చేస్తుంటుంది. జనాలకు మంచి చేయాలని, కార్పోరేటర్‌గా ఎదగాలని ఆటో డ్రైవర్‌ పెద్దన్న (నరేష్ అగస్త్య) ప్రయత్నిస్తుంటాడు. గ్యాస్ పైప్ లైన్ ప్రమాదంతో అంతా ఒక్కసారిగా మారిపోతుంది. నాయుడు తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహిస్తాడు. ఇక ప్రతాప్ వర్మకు చెక్ పెట్టాలని తన కూతురు భారతినిచ్చి పెళ్లి చేయాలని నాయుడు నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఆ ప్రమాదానికి కారణం ఎవరు? ఈ కథలో నాయుడు కుడి భుజం కోటయ్య (బెనర్జీ), అతని కొడుకు శేఖర్ (రాజా చెంబోలు) పాత్ర ఏంటి? నాయుడు వద్ద పని చేసే సూరి (సుధాకర్ కొమాకుల), భారతి ప్రేమ కథ ఎటు దారి తీస్తుంది? ఈ ప్రయాణంలో సీఐ వర్మ (సునీల్), తంగవేల్ (మైమ్ గోపీ) ప్రాముఖ్యత ఏంటి? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఒక సిటీ.. అందరినీ