
దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అత్యంత ముఖ్యమైన పబ్లిక్ అలర్ట్’ జారీ చేసింది. సిస్టమ్ అప్ డేట్ ప్రక్రియలో భాగంగా తన కీలకమైన ఆన్‌లైన్ క్లెయిమ్ పోర్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ తాత్కాలిక అంతరాయం కారణంగా ప్రొవిడెంట్ ఫండ్ (PF) ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలు (విత్‌డ్రాయల్స్), అడ్వాన్స్‌లు, ఖాతాల బదిలీలు (ట్రాన్స్‌ఫర్స్) ఇతర సభ్యుల సేవలు మూడు రోజుల పాటు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రతి నెలా తమ జీతాల నుంచి పొదుపు చేసుకునే ఉద్యోగులు త్వరలో రాబోయే ఈ మార్పులను గమనించి, తమ ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.మూడు రోజుల పాటు క్లెయిమ్స్ క్లోజ్ – షెడ్యూల్ ఇదే:ఈపీఎఫ్‌ఓ అధికారిక ప్రకటన ప్రకారం, సేవల నిలిపివేత -పునరుద్ధరణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి టైమ్‌లైన్ ఈ క్రింది విధంగా ఉంది:సేవలు నిలిచిపోయే సమయం: జూన్ 26వ తేదీ అర్ధరాత్రి 00:00 గంటల నుంచి.. (ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి)సేవల పునఃప్రారంభ సమయం: జూన్ 29వ తేదీ అర్ధరాత్రి 00:00 గంటల నుంచి (జులై 28 రాత్రి 23:59 వరకు బంద్).ఈ మూడు రోజుల సాంకేతిక విరామ సమయంలో చందాదారులు ఎలాంటి కొత్త క్లెయిమ్‌లను అధికారిక వెబ్‌సైట్ లేదా ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా దాఖలు చేయడానికి వీలుపడదు. ఈ కాలంలో సమర్పించే ఏ పీఎఫ్ ఉపసంహరణ అభ్యర్థనలైనా పెండింగ్‌లోనే ఉండిపోతాయి. అంతేకాకుండా, అంతకంటే ముందే దాఖలు చేసిన క్లెయిమ్‌లను కూడా ఈ సిస్టమ్ మైగ్రేషన్ పూర్తి అయిన తర్వాతే ప్రాసెసింగ్ కోసం అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. అత్యవసర సహాయం కోసం చందాదారులు అధికారిక టోల్-ఫ్రీ కాల్ సెంటర్ హెల్ప్‌లైన్ నెంబర్ 14470ను సంప్రదించవచ్చని సంస్థ సూచించింది. EPFO EDLI Scheme: కేవలం 20 రోజుల్లోనే ఫ్రీగా రూ.7 లక్షల బీమా..డేటాబేస్ అప్