ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సరైన ఆప్షన్.. టైమ్ ఇదే
Actor ProfilePolitician

ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సరైన ఆప్షన్.. టైమ్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సరైన ఆప్షన్.. టైమ్ ఇదే
TV9 Telugu23 Aug 2026
ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సరైన ఆప్షన్.. టైమ్ ఇదే

హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. మౌలిక వసతుల విస్తరణతో పాటు రవాణా, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల వృద్ధి వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్ని సంవత్సరాల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాల దూకుడు వంటివి భూముల ధరలను గణనీయంగా పెంచింది. మల్టీనేషనల్ కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే, ఫ్లైఓవర్‌ ప్రాజెక్టులు వేగంగా పూర్తవడం, రియల్ ఎస్టేట్‌కు మరింత గిరాకీ తెచ్చాయి. స్థిరాస్తి ధరలు పరుగులు… కొనుగోలుకు ఇదే సరైన సమయం! హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు గతంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రాపర్టీ విలువలు అధికంగా పెరిగాయి. మార్కెట్ తాత్కాలికంగా నెమ్మదించినా నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే పెట్టుబడి పెట్టడం లేదా ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తులో లాభదాయకం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి వెనుక ప్రధాన కారణాలు -అభివృద్ధి ప్రాజెక్టుల దూకుడు: హైదరాబాద్ నగరం భవిష్యత్ మేగాసిటీగా రూపుదిద్దుకుంటోంది. మెట్రో రైల్ ఫేజ్‌–II, ఫార్మా సిటీ, AI సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, హెల్త్ సిటీ వంటి ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి. ఈ మౌలిక వృద్ధి ప్రాజెక్టులు నగర విస్తరణకు కొత్త దారులు తెరిచాయి. - ఐటీ & ఫైనాన్స్ రంగాల విస్తరణ: హైదరాబాద్‌ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఐటీ హబ్‌లలో ఒకటి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, టీసీఎస్‌, విప్రో, HSBC వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త క్యాంపస్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ విస్తరణ వల్ల