ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్
Actor ProfileActor

ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్
TV9 Telugu10 Aug 2026
ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నిరీక్షణ. ఈ సినిమా విడుదలైన 44 ఏళ్లు పూర్తయ్యింది, ఆ సినిమా విశేషాలను సినీ విశ్లేషకుడు చిలకగంటి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, దర్శకుడు బాలు మహేంద్ర మేధస్సు, ఇళయరాజా అజరామర సంగీతం, ఈ సినిమా కల్పించిన అనుభూతిని వివరించారు. బాలు మహేంద్రకేవలం దర్శకుడిగానే కాక, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, రచయితగా ఆయన బహుముఖ ప్రజ్ఞను ప్రశంసించారు. వెట్రిమారన్, బాల వంటి దర్శకులకు బాలు మహేంద్ర స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. 1970వ దశకంలో శంకరాభరణం, మన ఊరి పాండవులు వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, 1985లో మలయాళంలో ‘యాత్ర (ది జర్నీ)’ పేరుతో తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మమ్ముట్టి, శోభన, తిలకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కేరళలో సంవత్సరం పాటు ఆడి ఘన విజయం సాధించింది. ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే నిరీక్షణ కథా నేపథ్యం 1975-77 అత్యవసర పరిస్థితులు (ఎమర్జెన్సీ) సమయంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. అప్పటి కఠిన చట్టాలు, పోలీసుల ప్రవర్తన, జైళ్లలో ఖైదీల పరిస్థితిని చిత్రీకరిస్తూనే, అందులో ఓ హృద్యమైన ప్రేమకథను చొప్పించి బాలు మహేంద్ర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మలయాళంలో విజయం సాధించిన వెంటనే, బాలు మహేంద్ర స్వయంగా తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో భానుచందర్, అర్చనలతో అదే కథను తెరకెక్కించి, దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను తానే స్వీకరించారు. ఇది కూడా చదవండి : ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట బాలు మహేంద్ర దర్శకత్వంలో సహజత్వం ప్రధానం. తన చిత్రాలలో నటీనటులకు మేకప్ లేకుండా సహజమైన లైటింగ్‌లో చిత్రీకరించేవారు. ‘నిరీక్షణ’లో అర్చన పాత్ర