ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు
Actor ProfilePolitician

ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు
Andhra Jyothy31 Jul 2026
ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని, అవసరమైతే తక్షణమే స్పందిస్తామని స్పష్టం చేశారు (Iran-US Strikes). అమెరికా దాడుల కారణంగా ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలకు గట్టి దెబ్బ తగిలినా, వారి వద్ద క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే శక్తి ఇంకా మిగిలి ఉందని ట్రంప్ అన్నారు (Donald Trump comments). అందువల్ల పశ్చిమాసియాలో శాంతి పూర్తిగా నెలకొన్నట్లు భావించకూడదని వ్యాఖ్యానించారు. 'ఇరాన్‌కు ఇంకా సామర్థ్యం ఉంది. అయితే అందంత ఎక్కువేం కాదు. ఎదురుదాడులు చేయగలదనే అనుకుంటున్నా. వాణిజ్య నౌకపై టెహ్రాన్ దాడి తెలివితక్కువ పని' అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, హింసకు హింసే సమాధానం అవుతుందని ఇరాన్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరించారు (US Iran Conflict). ఒకవేళ ఒప్పందంలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే తమకు ఫోన్ చేసి మాట్లాడాలని, ఇలా దాడులు చేయడం సరికాదని సూచించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు.. బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే