ఇరాన్ నేతల హత్యలకు ఇజ్రాయెల్ ప్లాన్? ముందే వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమెరికా.. బయటపడ్డ అసలు నిజాలు
Actor ProfilePolitician

ఇరాన్ నేతల హత్యలకు ఇజ్రాయెల్ ప్లాన్? ముందే వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమెరికా.. బయటపడ్డ అసలు నిజాలు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
భంభం భోలే అంటూ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.. ఆగస్టు 28 వరకు కొనసాగనున్న యాత్ర
Samayam Telugu7 Sept 2026
భంభం భోలే అంటూ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.. ఆగస్టు 28 వరకు కొనసాగనున్న యాత్ర

పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర భంభంభోలే నినాదాలతో మొదలైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లోని దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880

ఇరాన్ నేతల హత్యలకు ఇజ్రాయెల్ ప్లాన్? ముందే వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమెరికా.. బయటపడ్డ అసలు నిజాలు
Samayam Telugu6 Sept 2026
ఇరాన్ నేతల హత్యలకు ఇజ్రాయెల్ ప్లాన్? ముందే వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమెరికా.. బయటపడ్డ అసలు నిజాలు

ఇరాన్‌తో శాంతి ఒప్పందం‌పై అమెరికా సంతకాలు పెట్టిన తర్వాత యూఎస్ఏ - ఇజ్రాయెల్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అయితే, ఈ గ్యాప్ ఇప్పటిది కాదని, ఏప్రిల్ నెలలోనే ఇరు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి అంటూ ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ముఖ్యంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేయాలి అనుకున్న దాడులను అమెరికా అడ్డుకుంటూ వచ్చిందనే కీలక విషయాలు కూడా ఈ నివేదిక బయటపెట్టింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలీబాఫ్‌ను ఇజ్రాయెల్ హత్య చేయొచ్చని అమెరికా ఏప్రిల్‌లోనే టెహ్రాన్‌ను హెచ్చరించింది. ఆ సమయంలో అమెరికాతో జరుగుతున్న అణు చర్చల్లో పాల్గొనేందుకు అరాఘ్చీ, ఘాలీబాఫ్‌ను ఇరాన్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావించినట్లు నివేదిక పేర్కొంది. READ ALSO 'నెతన్యాహూతో సహా అన్ని సమస్యలు నేనే పరిష్కరిస్తా'.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్!న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 12న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ నుంచి టెహ్రాన్‌కు తిరిగి వస్తున్న ఘాలిబాఫ్ విమానాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడికి సిద్ధమైందని అమెరికా గుర్తించింది. ఇరాన్ గగనతలం మీదుగా ఇరాన్ వైపు వెళ్తున్న రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను గుర్తించి.. వెంటనే అమెరికా ఈ సమాచారాన్ని ఇరాన్‌కు అందించింది. దాంతో ఘాలిబాఫ్ టెహ్రాన్‌కు వెళ్లాల్సిన విమాన మార్గాన్ని మార్చి ఉత్తర ఇరాన్‌లోని మష్హద్ నగరంలో అత్యవసర ల్యాండ్ అయినట్లు పేర్కొంది. ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య అప్పటి నుంచే విభేదాలు నెలకొన్నాయని భావిస్తున్నారు. అమెరికా - ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం, శాంతి చర్చల విషయంలో కూడా ఇరు దేశాల వైఖరిపై స్పష్టమైన తేడాలు కనిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని మెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలు కూడా ఇటీవల బహిర్గతమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక