ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరింది. తుది ఒప్పందం ఖరారు దిశగా ప్రయత్నాలు (Ceasefire talks) కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఏప్రిల్‌లో మొదలైన కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసే విధంగా.. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధులే లక్ష్యంగా ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందినట్లు సమాచారం. ఈ దాడుల గురించి ఇరాన్‌ను అప్రమత్తం చేయాలని గల్ఫ్ దేశాలను అగ్రరాజ్యం కోరిందట. యూఎస్ మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ లక్ష్యంగా ఈ దాడులు ఉండే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌లో పాలనాయంత్రాంగాన్ని కూలదోసే లక్ష్యంతో అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) ఫిబ్రవరి 28న దాడులు మొదలుపెట్టాయి. ఘర్షణలు తీవ్రదశలో ఉన్నప్పుడు ఘాలిబఫ్, అరాగ్చీను టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ యోచించినట్లు తెలుస్తోంది. దాంతో ఏప్రిల్‌లో మొదలైన చర్చలను ఆ దాడులు దెబ్బతీసి, మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతాయని అమెరికా భావించింది. దాడులు ప్రారంభమైనప్పుడు ఇరాన్ నౌకాదళం, క్షిపణ వ్యవస్థలను ట్రంప్ సైన్యం లక్ష్యంగా చేసుకోగా.. కీలక నేతలను ఇజ్రాయెల్ (Israel) హతమార్చింది. తొలి రోజు దాడుల్లో నాటి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఇరాన్ (Iran) ఉన్నతస్థాయి నేతలు అలీ లారిజానీ, కమాల్ ఖరాజీ మృతి చెందారు. వీరిద్దరితోనే అమెరికా చర్చలు జరపాలని భావించింది. ఆ తర్వాత చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న అరాగ్చీ, ఘాలిబఫ్‌లను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందని అమెరికా అనుమానించింది. వీరిద్దరూ ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమైన తర్వాత యూఎస్ (USA) ఒత్తిడితో వారిని జాబితా నుంచి పక్కనపెట్టిందని సమాచారం. ఇక ఘాలిబఫ్ రెండుసార్లు మరణం అంచులవరకూ వెళ్లారు. 2025 జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో, ఈ ఫిబ్రవరిలో
Actor ProfilePolitician
ఇరాన్ దౌత్య ప్రతినిధులను ఇజ్రాయెల్ చంపుతుందేమో
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Eenadu•7 Sept 2026
ఇరాన్ దౌత్య ప్రతినిధులను ఇజ్రాయెల్ చంపుతుందేమో