ఇరాన్ చమురుకు డాలర్ పిలుపు..! ప్రపంచ ఆర్ధిక చిత్రం మార్చే పరిణామం..! భారత్ కూ మేలు
Actor ProfileCelebrity

ఇరాన్ చమురుకు డాలర్ పిలుపు..! ప్రపంచ ఆర్ధిక చిత్రం మార్చే పరిణామం..! భారత్ కూ మేలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ చమురుకు డాలర్ పిలుపు..! ప్రపంచ ఆర్ధిక చిత్రం మార్చే పరిణామం..! భారత్ కూ మేలు
Oneindia Telugu5 Jul 2026
ఇరాన్ చమురుకు డాలర్ పిలుపు..! ప్రపంచ ఆర్ధిక చిత్రం మార్చే పరిణామం..! భారత్ కూ మేలు

అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దశాబ్దాలుగా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చల అనంతరం, ఇరాన్ తన ముడి చమురును (iran oil) అమెరికన్ డాలర్లలో విక్రయించుకునేందుకు వాషింగ్టన్ తాత్కాలిక అనుమతి (వేవర్) మంజూరు చేసింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.Israel: ఒక్క దెబ్బతో అమెరికా-ఇరాన్ డీల్ ను నీరుగార్చేసిన ఇజ్రాయెల్..!ప్రపంచ మార్కెట్లోకి ఇరాన్ చమురు ఈ మినహాయింపుతో ఇరాన్ తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కానుంది. దశాబ్దాలుగా అమెరికా డాలర్ లావాదేవీలపై నిషేధం ఉండటంతో, ఇరాన్ చమురు వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు పడేది. కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలలో చమురును విక్రయించేది. ఇప్పుడు లభించిన తాత్కాలిక వెసులుబాటుతో నేరుగా డాలర్లలో వ్యాపారం చేస్తూ విదేశీ నిల్వలను పెంచుకునే వీలు కలిగింది.భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రభావంఈ ఊహించని పరిణామం అంతర్జాతీయ ముడి చమురు ధరలపై తక్షణ ప్రభావం చూపింది. సరఫరా మరింత సులభతరం అవుతుందనే అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గతంలో ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసిన భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తాజా పరిణామాలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆంక్షలు పూర్తిగా తొలగిపోతే భారత్‌కు తక్కువ ధరకే చమురు లభించే అవకాశం ఉంటుంది.ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..! అమెరికా నిర్ణయం వెనుక ?అయితే, ఈ అమెరికా రాయితీలు ఊరికే రాలేదు. ఇరాన్ తన అణు కేంద్రాలపై పారదర్శకతను పెంచేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) ప్రతినిధులను తిరిగి తమ దేశంలో విచారణ జరిపేందుకు ఇరాన్ అనుమతించనుంది.