ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు
Actor ProfileCelebrity

ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు

Total News2
Movie Updates0
Sources1
కంటతడి పెట్టిస్తున్న తల్లి కోతి వీడియో.. చనిపోయిన బిడ్డను పట్టుకుని
Andhra Jyothy16 Jun 2026
కంటతడి పెట్టిస్తున్న తల్లి కోతి వీడియో.. చనిపోయిన బిడ్డను పట్టుకుని

ఓ కోతి చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని ఒళ్లో పెట్టుకుని ఊరంతా తిరిగింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియక కళేబరాన్ని ముద్దులాడుతూ.. నాకుతూ లేపడానికి ప్రయత్నించింది. ఇంటర్‌నెట్ డెస్క్: ఈ సృష్టిలో తల్లి

ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు
Andhra Jyothy16 Jun 2026
ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు

ఫిఫా ప్రపంచకప్‌ 2026 వేళ ఇరాన్ అభిమానులకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఇరాన్‌ విప్లవానికి పూర్వం ఉపయోగించిన సూర్యడు, సింహం ఉన్న జెండాను ఫిఫా వేదికలపైకి తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది. స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌ 2026 వేళ ఇరాన్ అభిమానులకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఇరాన్‌ విప్లవానికి పూర్వం ఉపయోగించిన సూర్యడు, సింహం ఉన్న జెండాను తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది. దీంతో ఆ జెండాను స్టేడియాల్లో అనుమతించాలని కోరిన ఇరానియన్‌ మూలాలున్న అభిమానులకు కోర్టులో చుక్కెదురైంది. ఫిపా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. రాజకీయ, వివక్షపూరిత లేదా వివాదాస్పద చిహ్నాలను ప్రపచం కప్ వేదికలపైకి అనుమతించరాదు. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాయిస్‌ ఆఫ్‌ లిబర్టీ’ అనే సంస్థతో, అందులోని సభ్యుడు సామ్‌ కెర్మానియన్‌ కోర్టును ఆశ్రయించారు. విప్లవానికి పూర్వం ఉపయోగించిన ఇరాన్‌ జెండాను ప్రదర్శించడం ద్వారా ప్రస్తుత ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకతను, ప్రజాస్వామ్య సంస్కరణలకు మద్దతును తెలియజేయాలనుకుంటున్నామని పిటిషనర్లు వాదించారు. అయితే ఆ జెండాను అనుమతిస్తే అభిమానుల మధ్య ఘర్షణలు, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫిఫా పేర్కొంది. 1979 ఇస్లామిక్‌ విప్లవానికి ముందు, మొహమ్మద్‌ రెజా పహ్లావి పాలనలో ఈ జెండాను ఉపయోగించారు. లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు ఇందుకు సంబంధించి తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఫిఫా అమలు చేస్తున్న నిషేధ నిబంధన కొనసాగనుంది