ఇన్ స్టాగ్రామ్ లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది
Actor ProfileActor

ఇన్ స్టాగ్రామ్ లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది

Total News1
Movie Updates0
Sources1
ఇన్ స్టాగ్రామ్ లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది
Vaartha15 Jun 2026
ఇన్ స్టాగ్రామ్ లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది

Sanchita Ugale Last Video: బుల్లితెర నటి, ప్రముఖ హిందీ ధారావాహిక ‘కుంకుమ్ భాగ్య’ ఫేమ్ సంచిత ఉగాలే ఆత్మహత్య కేసు టెలివిజన్ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్న వయసులోనే ఆమె ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం సహచర నటీనటులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసుల ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. Read also: Vijay Deverakonda Rashmika: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇంట్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డిన్నర్! సంచిత ఉగాలే ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల మధ్య కాలంలో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. అయితే, ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ గానీ, ఇతర ఆధారాలు గానీ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సంచిత ఆత్మహత్యకు పాల్పడటానికి కేవలం కొన్ని గంటల ముందే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఎంతో సంతోషంగా, నవ్వుతూ, పూర్తి ఉత్సాహంగా కనిపించారు. ఎంతో యాక్టివ్‌గా ఉన్న నటి.. ఆ వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే బలవన్మరణానికి శరణు జొరడం అభిమానులను, నెటిజన్లను తీవ్రంగా కలవరపెడుతోంది. అసలు ఆ కొన్ని గంటల వ్యవధిలో ఆమె జీవితంలో ఏం జరిగింది? అనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం పోలీసులు సంచిత కుటుంబ సభ్యుల ప్రాథమిక వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? లేదా వృత్తిపరమైన ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె సన్నిహితులను, ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ కో-యాక్టర్లను