
క్రీడారంగంలో విజయాలు సాధించడం ఒక ఎత్తయితే, సామాజిక అడ్డంకులను ఛేదించుకుని ప్రపంచ స్థాయి గుర్తింపును పొందడం మరొక ఎత్తు. క్రీడారంగంలో విజయాలు సాధించడం ఒక ఎత్తయితే, సామాజిక అడ్డంకులను ఛేదించుకుని ప్రపంచ స్థాయి గుర్తింపును పొందడం మరొక ఎత్తు. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ రెండింటినీ సాధించి, నేడు భారతీయ క్రీడా చరిత్రలో ‘గ్లోబల్ ఐకాన్’గా నిలిచారు. మెస్సీ, రొనాల్డో వంటి క్రీడా దిగ్గజాలతో సమానంగా టైమ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా... ఈ ఏడాది టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్మృతి మంధాన చోటు దక్కించుకున్నారు. అనేక ఏళ్లపాటు బ్యాటింగ్‌లో నిలకడగా రాణించడం, ఆర్సీబీ జట్టును వరసగా రెండేళ్లుడబ్ల్యూపీఎల్ విజేతగా నిలిపిన నాయకత్వ పటిమ, ఐసీసీ టోర్నీల్లో భారత్ సాధించిన విజయాల్లో... స్మృతి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించింది కూడా. భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణి ఆమె. ముంబయిలో పుట్టారు స్మృతి. ఆమెకు రెండేళ్లున్నప్పుడు వారి కుటుంబం సాంగ్లీలో స్థిరపడింది. తండ్రి శ్రీనివాస్, తల్లి స్మిత. తోటి పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటోన్న సమయంలో స్మృతి మాత్రం నాన్న, అన్నయ్యల క్రికెట్ ప్రాక్టీస్‌ను ఆసక్తిగా గమనించేవారట. ఇది ఆమెకు ఆటపై ప్రేమను పెంచింది. ఆమెది కుడిచేతి వాటం. తండ్రికి ఎడమచేతి వాటం బ్యాటర్లంటే ఇష్టం. ఆ ఇష్టమే స్మృతిని లెఫ్టీగా మార్చింది. రాహుల్ ద్రవిడ్ సంతకం చేసిన బ్యాట్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆ చిన్నారికి భవిష్యత్తులో దేశం గర్వించే క్రికెటర్ అవుతానని అప్పట్లో తెలియదు. తొమ్మిదేళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికై, పదకొండేళ్లకే అండర్-19 టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టినప్పట్నుంచి వెనుదిరిగి చూడలేదామె. మహిళా క్రికెట్‌కు సరైన ఆదరణ లేని రోజుల్లో, స్మృతిని క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు ఆమె కుటుంబం ఎన్నో కష్టనష్టాలను