
భారత మార్కెట్లోకి కొత్త 2026 కవాసకి నింజా 500 బైక్ ఈ బైకు ఇంజిన్ ఇప్పుడు E20 ఇథనాల్‌తో రన్ అవుతుంది కవాసకి నింజా బైకు ధర రూ. 5.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) 2026 Kawasaki Ninja 500 : కొత్త బైక్ కొనేవారి కోసం మార్కెట్లోకి అద్భుతమైన సూపర్ బైక్ వచ్చేసింది. మీరు స్టైలిష్ బైక్‌లను ఇష్టపడేవారు అయితే ఇది మీకోసమే.. కొంచెం ఖరీదైన మంచి బైక్ కొనాలని చూస్తుంటే ఇంతకన్నా బెటర్ బైకు దొరకదు.. అందులోనూ E20 ఫ్యూయల్ సపోర్టు చేసే వాహనాలే కొనేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కవాసకి కంపెనీ భారతీయ యూజర్ల కోసం (2026 Kawasaki Ninja 500) 2026 కవాసకి నింజా 500 కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇంజన్ ఇప్పుడు E20 ఫ్యూయల్ కోసం ట్యూన్ చేశారు. 2026 కవాసకి నింజా 500 భారత మార్కెట్లో రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభ్యమవుతోంది. ఈ బైక్‌లో అతిపెద్ద మార్పు ఇంజిన్ మాత్రమే.. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా E20 ఫ్యూయల్ ఇంజిన్ అందిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు క్రమంగా 20శాతం ఇథనాల్ పెట్రోల్ మాత్రమే అందించనున్నాయి. పాత ఇంజిన్‌లు ఈ ఫ్యూయల్‌ను తట్టుకోలేవు. ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. ఈ కవాసకి బైక్ పవర్ టార్క్ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పు లేదు. రైడ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. అయితే, కలర్ ఒక్కటే మారింది. కవాసకి పాత పెయింట్ ఆప్షన్ కాకుండా క్లాసిక్ లైమ్ గ్రీన్ షేడ్‌కు మారింది. ప్రస్తుతం ఈ బైకు బుకింగ్‌లు ముందే ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు నాటికి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. Read Also : AI Plus Nova 2 Pro 5G : AI+ నోవా 2 ప్రో 5జీ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 48MP