
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతోన్న చిత్రం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సంచలన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కలయికలో రాబోతోన్న చిత్రం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కోట్లాది మంది అభిమానుల ప్రేమను, ఆప్యాయతను పొందడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, అలాగే ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించిన తేజస్వినికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా బిడ్డ తేజస్విని గతంలో నా ‘అన్‌స్టాపబుల్’ షోకు సంబంధించి క్రియేటివ్ విభాగంలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత భారీ స్థాయిలో ఒక సినిమా ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. దర్శకుడు, నిర్మాతలతో కలిసి నేను పనిచేయడం ఇదే మొదటిసారి కావడం ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. అభిమానులు కోరుకునేలా ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. ఈ పరిశ్రమకు విజయవాడ ఒక కీలక కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉంది. ‘అఖండ’ సినిమా కోసం మేము రాష్ట్రవ్యాప్తంగా అనేక అందమైన ప్రదేశాలలో విస్తృతంగా చిత్రీకరణ జరిపాం. చలనచిత్ర పరిశ్రమ