"ఇడుపు కాయితం" ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న పేరు. ఈ పేరుపై వస్తున్న ట్రోల్స్, కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇడుపు కాయితం అంటే అర్థం ఏమిటంటూ జరుగుతున్న ట్రోలింగ్ మీద తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇడుపు కాయితం అర్థం తెలియాలంటే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అడగాలంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు ఇడుపు కాయితం అర్థం బాగా తెలుసని.. ఆయనైతే కరెక్టుగా చెప్తారని ఎద్దేవా చేశారు. "ఇడుపు కాయితమంటే ఏందో అర్థమైతలేదంట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా. ఇడుపు కాయితమంటే అర్థంకాలేదని మాట్లాడుతున్నవారు.. పవన్ కళ్యాణ్‌ను అడగాలి. ఆయనకు దానర్థం బాగా తెలుసు. కచ్చితంగా మీకు చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే రాష్ట్రం వచ్చింది. ఇంకోసారి అలాంటి వెకిలి ప్రయత్నం చేయొద్దు. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం.. ఒకరి సంస్కృతిని ఒకరం గౌరవించుకుందాం.. అందరం కలిసి ఉందాం. అలా కాదని ఇలాంటి ప్రయత్నాలు చేసి తెలంగాణను, తెలంగాణ భాషను అవమానిస్తామంటే చూస్తూ ఊరుకోం. తెలంగాణ భాషను కించపరుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏమీ మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. బీజేపీకి దేశంలోని అంశాలే తప్ప తెలంగాణ పట్దదు." అని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రియదర్శి, నాగదుర్గ హీరో హీరోయిన్లుగా ‘ ఇడుపు కాయితం ’ మూవీ షూటింగ్ గురువారం రోజున ప్రారంభమైంది. దొండపాటి వంశీరెడ్డి డైరెక్షన్‌లో ఇడుపు కాయితం ఫస్ట్ లుక్ గురువారం విడుదల చేశారు. అయితే ‘ఇడుపు కాయితం’ టైటిల్ బయటకు రాగానే దీని అర్థం ఏమిటి? అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ పదం కావటంతో నేటి యువతకు దీనర్థం తెలియడం లేదు. అయితే ఇడుపు కాయితమంటే విడాకుల పత్రమని అర్థం. విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులు పెద్దల సమక్షంలో చేసుకునే
Actor ProfilePolitician
ఇడుపు కాయితం' అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ ను అడగండి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•8 Aug 2026
ఇడుపు కాయితం' అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ ను అడగండి