
'ఇడుపు కాయితం' సినిమాకు ఇలా క్లాప్ కొట్టారో లేదో... అలా టైటిల్ పై రచ్చ మొదలైంది. తెలంగాణ మాండలీకానికి చెందిన ఈ టైటిల్ చాలామందికి అర్థం కాదనే విమర్శలు వస్తున్నాయి. అయితే దానికి దీటుగా తెలంగాణ వాదులు బదులిస్తున్నారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా గురువారం మొదలైన 'ఇడుపు కాయితం' మూవీ పూజా కార్యక్రమాలతో ఇలా మొదలైందో లేదో సోషల్ మీడియాలో రచ్చ అలా మొదలైపోయింది. ఈ పదం అర్థం తెలియక కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో మాటల యుద్థం స్టార్ట్ అయ్యింది. ఈ టైటిల్ మీద అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతీయాభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై సుకుమార్ సతీమణి తబిత, బన్నీ వాస్ కలిసి 'ఇడుపు కాయితం' అనే సినిమాను ప్రారంభించారు. తెలంగాణలో 'ఇడుపు కాగితం' అంటే విడాకుల కాగితం అని అర్థం. విడాకుల నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ నేపథ్య చిత్రంపై మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున తబిత మాట్లాడుతూ, 'తెలంగాణ మహిళగా ఈ కథతో తాను బాగా కనెక్ట్ అయ్యానని, సుకుమార్ కనెక్ట్ అవుతారో లేదో తనకు తెలియదని, అయినా ఈ సినిమాను నిర్మించా ల్సిందేనని తాను పట్టు పట్టాన'ని తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల ప్రియదర్శి, నాగదుర్గ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన పలువురు టీవీ మీడియా ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ చేసే వారు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ జనాల నోట్లో నానే ఈ పేరు పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేశారు. అచ్చ తెలంగాణా చిత్రంగా ఇది తెరకెక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే 'ఇడుపు కాయితం' అంటే అర్థం తెలియని కొందరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చకు దారితీశాయి. ఈ