ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక
Actor ProfilePolitician

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక

Total News1
Movie Updates0
Sources1
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక
NTV Telugu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక

Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఉదారతతో రియల్ లైఫ్ హీరోలుగా నిలిచారు. పెళ్లి పీటలపై తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ది దేవరకొండ ఫౌండేషన్' (The Deverakonda Foundation) తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. బల్మూరు మండలంలోని తుమ్మన్‌పేట గ్రామానికి విజయ్ దేవరకొండ కుటుంబంతో విడదీయరాని బంధం ఉంది. అది విజయ్ తండ్రి గోవర్ధన్ స్వగ్రామం. రష్మికతో వివాహం అనంతరం ఈ గ్రామానికి సతీసమేతంగా విచ్చేసిన విజయ్.. అక్కడే తన వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ఆ రోజే అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తానని ప్రామిస్ చేశారు. తాజాగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన వేళ.. ఆ నియోజకవర్గంలో 1, 2 ర్యాంకులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించి తన మాట నిలబెట్టుకున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం: విజయ్ దేవరకొండ విద్యార్థులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. "మీరు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేయడానికే మేమంతా ఇక్కడికి వచ్చాం. మార్కులు ఎక్కువ రావడం కంటే.. దానికోసం మీరు పడిన శ్రమ, చూపిన ఏకాగ్రత చాలా గొప్పవి. నేను, రష్మిక మా స్టూడెంట్ లైఫ్‌లో ఎప్పుడూ టాపర్స్ కాదు. నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణలోనే టెన్త్ రిజల్ట్స్‌లో సెకండ్ ప్లేస్ సాధించిందని డీఈఓ గారు చెప్పడం చాలా గర్వంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా ఇక్కడి టీచర్లదే. మా నాన్న, అమ్మ ఈ ఊరితో పెంచుకున్న అనుబంధం వల్లే నేడు నేను ఈ ఛారిటీ చేయగలుగుతున్నాను. మీ అందరి జీవితాల్లో నేను ఒక భాగం కావాలనే ఈ ప్రయత్నం. ఇప్పుడు అచ్చంపేటలో స్టార్ట్ చేశాం.. నెక్స్ట్ నాగర్ కర్నూలు