ఇక పాకిస్తాన్ కు సినిమానే..! భారత్ కు అమెరికా వేల కోట్ల గిఫ్ట్
Actor ProfileCelebrity

ఇక పాకిస్తాన్ కు సినిమానే..! భారత్ కు అమెరికా వేల కోట్ల గిఫ్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇక పాకిస్తాన్ కు సినిమానే..! భారత్ కు అమెరికా వేల కోట్ల గిఫ్ట్
Oneindia Telugu28 Jun 2026
ఇక పాకిస్తాన్ కు సినిమానే..! భారత్ కు అమెరికా వేల కోట్ల గిఫ్ట్

సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ మనల్ని కంట్రోల్ చేయాలని ఎంత స్కెచ్ వేసినా.. భారత్ మాత్రం తన రక్షణ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూనే పోతోంది. తాజాగా భారత సాయుధ దళాల అమ్ములపొదిని మరింత పటిష్టం చేసేలా అగ్రరాజ్యం అమెరికా ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మన ఆర్మీ దగ్గరున్న మోస్ట్ పవర్‌ఫుల్ అపాచీ హెలికాప్టర్లు, హిమాలయ పర్వతాల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఎమ్-777 అల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల కోసం సుమారు 482.2 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో ₹4,000 కోట్లకు పైగా) సైనిక ప్యాకేజీని అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక బంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ మెగా డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.చైనా బార్డర్‌లో గర్జించే హోవిట్జర్లు.. ఇక నిరంతర ఆపరేషన్లు!తూర్పు లడఖ్ లాంటి మంచు కొండల్లో, శ్వాస తీసుకోవడమే కష్టమయ్యే హిమాలయ యుద్ధ క్షేత్రాలలో మన సైన్యానికి కొండంత అండగా నిలిచేవి ఎం777ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్లు. చాలా తేలికగా ఉండటం వల్ల వీటిని హెలికాప్టర్ల ద్వారా ఎక్కడికైనా ఈజీగా మార్చవచ్చు. ఈ ఫిరంగులకు ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా, నిరంతరం పనిచేసేలా చూసేందుకు ఈ ప్యాకేజీలో 230 మిలియన్ డాలర్లను కేటాయించారు. దీని ద్వారా వీటికి అవసరమైన విడిభాగాలు, మరమ్మతుల సేవలు, మన సైనికులకు ప్రత్యేక శిక్షణ లభిస్తాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ బిఏఈ సిస్టమ్స్ (BAE Systems) ఈ సహాయక కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించనుంది.ఆకాశంలో శత్రువుల పీడకల అపాచీ.. ప్రత్యర్థులపై డేగ కళ్లతో నిఘా ఉంచి, ఖచ్చితమైన దాడులు చేయడంలో ప్రపంచంలోనే నంబర్ వన్ రక్షణ సామర్థ్యం గల హెలికాప్టర్లు ఏహెచ్-64ఈ అపాచీ. మన ఆర్మీ ఆధీనంలోని ఈ ఫ్లయింగ్ ట్యాంకులను ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా (రౌండ్-ది-క్లాక్) ఉంచేందుకు 198.2 మిలియన్ డాలర్ల మద్దతును అమెరికా ప్రకటించింది.