ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్ ను ఎక్కడా చూసుండరు.. వీడియో వైరల్
Actor ProfilePolitician

ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్ ను ఎక్కడా చూసుండరు.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్ ను ఎక్కడా చూసుండరు.. వీడియో వైరల్
Andhra Jyothy4 Aug 2026
ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్ ను ఎక్కడా చూసుండరు.. వీడియో వైరల్

ఢిల్లీలోని కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఆకాన్ష్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశాడు. ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీలోని కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఆకాన్ష్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశాడు. ‘కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న వింత యాక్సిడెంట్‌ను చూశా. ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు’ అని రాసుకొచ్చాడు. ఆ వీడియోలో ఏముందంటే.. యాక్సిడెంట్ తర్వాత కారు ఫుట్‌పాత్ సమీపంలోని చెట్టు దగ్గర ఆగిపోయింది. అయితే, ఆ కారు అంత పర్‌ఫెక్ట్‌గా అక్కడికి ఎలా వచ్చి చేరిందన్నది మిస్టరీగా మారింది. కారు ఎడమ వైపు ముందు భాగం బాగా దెబ్బతింది. ఆ భాగం చెట్టుకు ఆనుకుని ఉంది. రోడ్డు మీద నుంచి చూస్తే ఆ కారు భవనం ఉన్న వైపు నుంచి దూసుకుచ్చి చెట్టును ఢీకొట్టినట్లుగా ఉంది. అయితే, ఆ భవనం వైపు నుంచి రావటానికి ఎలాంటి మార్గం లేదు. కారు చెట్టును ఢీకొట్టి పక్కకు తిరిగిందనుకుంటే.. ఫుట్‌పాత్‌లాంటి ఆ ప్రదేశంలో మొక్కలు నాటి ఉన్నాయి. ఆ మొక్కలకు ఏమీ కాకుండా ఆ కారు ఎలా అటు వైపు వెళ్లింది అన్నది అంతుచిక్కని ప్రశ్న. కారును ఎవరో చేతులతో ఎత్తి మొక్కలు, చెట్టు మధ్య ఉంచినట్లుగా ఆ దృశ్యం ఉంది. ఆకాన్ష్ ఆ వీడియోలో ఈ విషయాల గురించి చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నేను అలాగే డ్రైవింగ్ చేస్తాను. మీరు నా డ్రైవింగ్ స్కిల్స్‌ను శంకిస్తున్నారా?’.. ‘నిజంగా ఈ వీడియో చూస్తుంటే నా మతిపోతోంది’ అంటూ