ఇండియన్ రైల్వే కొత్త రూల్స్
Actor ProfileCelebrity

ఇండియన్ రైల్వే కొత్త రూల్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇండియన్ రైల్వే కొత్త రూల్స్
Sakshi2 Jul 2026
ఇండియన్ రైల్వే కొత్త రూల్స్

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించడంతో పాటు, క్రమశిక్షణ, నియమాల అమలు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని నిబంధనలు ప్రవేశ పెట్టడమే కాకుండా.. పాత నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. స్మోకింగ్ చేస్తే.. రైళ్లలో స్మోకింగ్ పూర్తిగా నిషేధం. రైల్వే ప్రాంగణం, కోచ్‌లలో స్మోకింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఇటీవల కొన్ని ఘటనల్లో ప్రయాణికులు రైలులో స్మోకింగ్ చేయడం లేదా ప్రమాదకర పదార్థాలు తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. కొత్త చట్టాల ప్రకారం, స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తే.. మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లో (లేడీస్ కంపార్ట్‌మెంట్) పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల భద్రతను పెంచడం, వేధింపులు, అనవసర ప్రవేశాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈ నియమాన్ని అమలు చేశారు. రైల్వే భద్రతా సిబ్బంది (RPF), టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE) రాత్రి వేళలు, రద్దీ సమయాల్లో మరింత కఠినంగా తనిఖీలు నిర్వహించనున్నారు. రైళ్లలో అక్రమంగా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం కూడా చట్ట విరుద్ధమే. ఇలాంటివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరికి జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్‌తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది. మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు) సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్ ‘హను మాన్‌