Zero Income Tax : భారతదేశంలో ఆదాయ పన్నును వ్యక్తిగతంగానే లెక్కిస్తారు, కానీ కుటుంబం మొత్తానికి కలిపి లెక్కించరు. అయితే ఒక ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చిరాగ్ చౌహాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఉదాహరణ ప్రకారం ఒక ఇంట్లో నలుగురు సంపాదిస్తున్నప్పుడు, ఐటీ చట్టంలోని వేర్వేరు సెక్షన్లను వాడుకుంటూ రూ. 40 లక్షల ఉమ్మడి ఆదాయంపై పైసా కూడా టాక్స్ లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చట్టబద్ధమైన లెక్కలతో వివరించారు. ఆ స్మార్ట్ ప్లాన్ గురించి ఇప్పుడు చూద్దాం. దీనిపై నెట్టింట విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక్కడ ఇంకా రూ. 40 లక్షల ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ కోట్లు ఉంది. రూ. 1 కోటి ఎఫ్‌డీ ఉంది. అయినా టాక్స్ పడకపోవడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతోంది.అయితే కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని పరిస్థితుల్లో ఇది చట్టబద్ధంగానే సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కుటుంబ మొత్తం ఆదాయంపై టాక్స్ మినహాయింపు కానే కాదు. ప్రతి వ్యక్తి ఆదాయాన్ని విడివిడిగా లెక్కించే భారత ఆదాయపు పన్ను విధానం వల్ల ఈ అవకాశం ఏర్పడుతుంది. చిరాగ్ చౌహాన్ ట్వీట్ ప్రకారంకుటుంబంలో నలుగురు సభ్యులు- వారి ఆదాయాలు ఇలా ఉన్నాయి. తండ్రి- బిజినెస్ టర్నోవర్ రూ. 2 కోట్లు తల్లి- రూ. 1 కోటి ఫిక్స్‌డ్ డిపాజిట్ కొడుకు- రూ. 10 లక్షల వార్షిక జీతం కూతురు- రూ. 12 లక్షల వార్షిక జీతంఇలా వీరందరి ఆదాయం కలిపి రూ. 40 లక్షలవుతుంది. పన్ను జీరో అని చెబుతున్నారు. తండ్రికి రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్నా జీరో టాక్స్ ఎందుకు?ఇక్కడే చాలా మంది పొరబడతారు. టర్నోవర్‌ను ఆదాయంగా భావించరు. అసలు విషయం ఇది కాదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44AD ప్రకారం చిన్న వ్యాపారులకు ప్రత్యేక విధానం ఉంది. వ్యాపార టర్నోవర్ నిర్ణీత పరిమితిలో ఉన్నట్లయితే ప్రతి ఖర్చు
Actor ProfilePolitician
ఇంట్లో రూ. 40 లక్షల సంపాదన ఉన్నా జీరో టాక్స్.. 'ఫ్యామిలీ' ప్లానింగ్ తో సాధ్యమే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Aug 2026
ఇంట్లో రూ. 40 లక్షల సంపాదన ఉన్నా జీరో టాక్స్.. 'ఫ్యామిలీ' ప్లానింగ్ తో సాధ్యమే- సీఏ చెప్పిన