
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎ నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(బుధవారం) వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎ నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం కంటే.. వెస్టిండీస్ కెప్టెన్ హెయిలీ మాథ్యూస్ ఔటైన తీరు, థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారాయి. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ లిన్సే స్మిత్ వేసిన ఆఫ్ స్టంప్ వెలుపలికి బంతిని వేసింది. మాథ్యూస్ ఆ బంతిని కట్ చేయడానికి ప్రయత్నించగా.. అది వికెట్ కీపర్ అమీ జోన్స్ చేతుల్లో పడింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఎన్. జనని నిరాకరించగా, ఇంగ్లండ్ రివ్యూ (DRS) కోరింది. టీవీ రీప్లేలలో బ్యాట్‌కు, బంతికి మధ్య స్పష్టమైన గ్యాప్ ఉన్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నప్పటికీ.. అల్ట్రాఎడ్జ్‌లో వచ్చిన ఒక చిన్న స్పైక్ ఆధారంగా థర్డ్ అంపైర్ నిమాలి పెరీరా మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై వెస్టిండీస్ కెప్టెన్ హెయిలీ మాథ్యూస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ..'బంతి నా బ్యాట్‌కు చాలా దూరంగా ఉంది. అల్ట్రా ఎడ్జ్‌లో వచ్చిన శబ్దం బంతిది కాదు, బహుశా నా బ్యాట్ హ్యాండిల్ ప్యాడ్‌కు తగలడం వల్ల వచ్చి ఉండవచ్చు. టీవీ స్క్రీన్‌పై స్పష్టమైన గ్యాప్ కనిపిస్తున్నా,టెక్నాలజీ ఆధారంగా అంపైర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని గౌరవించక తప్పదు' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' డాని వ్యాట్-హాడ్జ్ (42 బంతుల్లో 65 పరుగులు)