ఆహార పదార్థాల కల్తీ
Actor ProfileCelebrity

ఆహార పదార్థాల కల్తీ

Total News1
Movie Updates0
Sources1
ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి
Namasthe Telangana17 Jun 2026
ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 17 : పానీపూరి తిని అస్వస్థతకు గురైన బాధిత చిన్నారులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. స్థానిక సుభాష్‌నగర్‌లోని సీపీఐ కార్మిక భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్ ఇన్‌స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యాపారులు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకుండా వీధుల్లో పానీపూరి, ఐస్‌క్రీమ్, చెరుకురసం విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి ఆహార పదార్థాల విక్రయాలపై తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు గుంటి వేణు, మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు పాల్గొన్నారు