
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. గాసిప్.. మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాసిప్’. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మించిన ఈ చిత్రం త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన లవ్ స్టోరీతో సోషల్ సెటైర్‌గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీని వైభవ్ కౌండిన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సిప్పు సిప్పు సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేస్తే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ రాశారు.సింగర్ మాళవిక వోకల్స్ ఈ పాటను ఆలపించారు. సోషల్ సెటైర్ మూవీగా “గాసిప్” రాబోతున్న ఈ చిత్రం ఒక మిడిల్ క్లాసు అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్ కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ పాట చాలా ఫ్రెష్ గా ఉండడంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. సునీల్ సున్నపు మాస్టర్, ఫల్గుణి బంగెర కొరియోగ్రఫీ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను