
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: మరో నెల రోజుల్లో ఆషాడమాసం ప్రారంభం కానుంది. ఆషాడం వచ్చిందంటే చాలు చాలామంది బంగారం ధర తగ్గుతుందని భావిస్తారు. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో నెల రోజుల పాటు పెళ్ళిళ్ళు కూడా లేకపోవడంతో బంగారం గిరాకీ తగ్గి ధరలు తగ్గుతాయని గతంలో చాలామంది భావించేవారు. అందుకు తగ్గట్టుగానే బంగారం ధరలు తక్కువగా ఉంటాయని ఆషాడంలో బంగారం షాపింగ్ చేసే వారు కూడా భారీగా ఉంటారు. అటు బంగారం షాపుల యజమానులు కూడా ఆషాడంలో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. మరి ఈసారి కూడా ఆషాడంలో బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా వంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై రెండో వారం నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా భారతీయ మార్కెట్లలో ఆషాడ మాసంలో పెళ్లిళ్లు గృహప్రవేశాలు వంటివి జరగవు దీంతో బంగారం మార్కెట్ కాస్త డల్ గా ఉంటుంది. ముఖ్యంగా జువెలరీ షాపుల్లో రద్దీ తగ్గిపోతుంది. దీని ప్రభావం బంగారం ధరలపై కూడా పడే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆషాడంలో నగల డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా బంగారం ధర అనేది ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో భారతీయ జ్యువెలరీ మార్కెట్ ప్రభావం బంగారం పైన పెద్దగా పడకపోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలను ఎక్కువగా అమెరికా ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు అనేవి ప్రభావితం చేస్తుంటాయి. ప్రస్తుతం అమెరికా వడ్డీరేట్లను కనుక పెంచినట్లయితే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైనట్లయితే ఆషాడంలో బంగారం ధరలు భారీగా