ఆలియా ఆ అనుమానాల ను తీరుస్తుందా
Actor ProfileActor

ఆలియా ఆ అనుమానాల ను తీరుస్తుందా

Total News1
Movie Updates0
Sources1
ఆలియా ఆ అనుమానాల ను తీరుస్తుందా
Telugu Times17 Jun 2026
ఆలియా ఆ అనుమానాల ను తీరుస్తుందా

యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఆల్ఫా(Alpha) సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆలియా భట్(Alia Bhatt) కెరీర్‌లో విజయాలు, పరాజయాలు రెండూ చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి నెలకొంది. గంగూబాయి కాఠియావాడి(Gangubhai Katiawaadi), బ్రహ్మాస్త్ర(Brahmastra), రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ(Rocky Aur Rani ki Prem Kahani) వంటి సినిమాల‌తో తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్న ఆలియా, జిగ్రా(Jigraa) రూపంలో నిరాశను కూడా ఎదుర్కొంది. దీంతో హీరోయిన్‌ ప్రధానంగా ముందుండి నడిపిస్తున్న ఆల్ఫా ఫలితం ఆమె కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఇక య‌ష్ రాజ్ ఫిల్మ్స్(YRF) స్పై యూనివర్స్ సినిమాల కథన శైలిపై ఇటీవల ప్రేక్షకుల్లో వినిపిస్తున్న విమర్శలు కూడా ఆల్ఫా చుట్టూ చర్చకు దారితీశాయి. గత సినిమాల్లో కనిపించిన ఫార్ములానే మళ్లీ కొనసాగుతుందనే సందేహాలు కొందరిలో ఉన్నప్పటికీ, బలమైన కథ మరియు ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఉంటే అలాంటి అభిప్రాయాలను సులభంగా మార్చేయవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టినా, కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే రిలీజ్‌కు ముందు ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశం మేకర్స్‌కు ఉంది. ఆలియా భట్ త‌ర్వాతి సినిమాల లిస్ట్ లో లవ్ అండ్ వార్(Love And War) కూడా ఉన్నప్పటికీ, ఆల్ఫా ప్రాధాన్యం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరగనుంది. ఇటీవల భారీ స్థాయి యాక్షన్, స్పై థ్రిల్లర్లపై ప్రేక్షకుల అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఆల్ఫాకు పాజిటివ్ టాక్ అత్యంత కీలకంగా మారింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధించాలంటే తొలి రోజు ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా అవసరం. అందుకే రాబోయే వారాలు