
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. 'చిట్టి కలెక్టర్' ఆర్నా వీడియోనే తెగ హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది. ఆ క్యూట్ వీడియోను చూసిన ఏపీ సీఎం చంద్రబాబు తెగ నచ్చేయడంతో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అది టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సీఎం మనసును అంతలా దోచుకున్న వీడియోలో ఇంతకూ ఏముంది!? రాజకీయ సమావేశాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు... ఈసారి మాత్రం ఓ చిన్నారి క్యూట్ వీడియో చూసి నవ్వేశారు. అంతేకాదు... ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ప్రత్యేకంగా ప్రశంసించడంతో 'చిట్టి కలెక్టర్' ఆర్నా ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఈ వైరల్ వీడియోకు ప్రేరణగా నిలిచింది విక్టరీ వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా. ఈ మూవీలో హీరోయిన్‌ను నమ్మించడానికి ఓ రేంజ్‌లో అబద్ధం చెబుతాడు వెంకటేశ్. తాను వైజాగ్‌కు కలెక్టర్‌గా పనిచేస్తున్నానని.. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండగా.. బయట తన తండ్రి పడిగాపులు కాస్తున్నాడని తెలిసి మీటింగ్ మధ్యలోనే వచ్చేసినట్లు ఒక ఫన్నీ స్టోరీ అల్లుతాడు. సరిగ్గా ఇదే సీన్‌ను బేస్ చేసుకుని.. చిన్నారి ఆర్నా తండ్రి ఏఐ సాయంతో క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తోంది. వీడియోలో వైజాగ్ జిల్లా కలెక్టర్ సీట్లో దర్జాగా కూర్చున్న ఈ బుజ్జాయి.. సాక్షాత్తూ సీఎంతోనే కాన్ఫరెన్స్‌లో ఉన్నట్లు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. తాను లోపల మీటింగ్‌లో ఉంటే.. బయట తండ్రి వెయిట్ చేయడంపై ఆ పాప వెంకీ డైలాగ్స్‌కు సింక్ చేస్తూ పలికించిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవెల్... అంతే. ఈ చిట్టి కలెక్టర్ నటనకు ఫిదా అయిపోయిన చంద్రబాబు నాయుడు ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం ఎవరి తరం కాదు... తాను కూడా