
పుణె: సమాచార హక్కు చట్ట(ఆర్‌టీఐ) నిబంధనలకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలను వెంటనే ఉపసంహరించకపోతే నిరవధిక నిరాహర దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. మహారాష్ట్ర సమాచార హక్కు నియమావళి 2026 ఆర్‌టీఐకి ఉన్న సమర్థతను తగ్గిస్తుందని, ప్రజలను సమాచార సేకరణకు దూరం చేస్తుందని ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. జూన్ 12న చేసిన ఈ సవరణలు, ఆర్‌టీఐ చట్టం 2005 స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని, పారదర్శకతను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎలాంటి వివరణ లేకుండా ఫీజులు పెంచడాన్ని హజారే వ్యతిరేకించారు. ఆర్‌టీఐ అనేది ఆదాయార్జన చట్టం కాదు. ఒకవేళ ఫీజు పెంచితే.. సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించే అధికారుల పెనాల్టీలు కూడా పెంచాలని ఆయన లేఖలో సూచించారు. దీంతో పాటు సవరణలోని పలు నిబంధనలను హజారే తీవ్రంగా వ్యతిరేకించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు