ఆర్ జీయూకేటీలకు 4
Actor ProfilePolitician

ఆర్ జీయూకేటీలకు 4

Total News1
Movie Updates0
Sources1
ఆర్ జీయూకేటీలకు 4,040 విద్యార్థులు ఎంపిక
Eenadu13 Jun 2026
ఆర్ జీయూకేటీలకు 4,040 విద్యార్థులు ఎంపిక

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ)లో బీటెక్ ప్రవేశాల ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. నూజివీడు, ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలైనట్లు వెల్లడించారు. మొత్తం 4,410 దరఖాస్తులు రాగా.. 4,040 మంది మాత్రమే ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో 96 శాతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ఆర్‌జీయూకేటీ ఆశయానికి నిదర్శనంగా ఈ ఎంపిక గర్వకారణమన్నారు. ఈ వార్త చదివారా: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. పెంపుడు కుక్క మృతి