
ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి సర్వీస్‌లను అందించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ.. అక్కడి కాంగ్రెస్‌కు వెల్లడించింది. అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రాలైట్ శతఘ్నులకు సంబంధించిన సర్వీసులను అగ్రరాజ్యం అందించనుంది. ఈ డీల్ విలువ 482 మిలియన్ డాలర్లుగా అంచనావేసింది. విదేశాలకు ఆయుధ విక్రయాలను పర్యవేక్షించే ది డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ.. ఇటీవల ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ అమ్ములపొదిలోని కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది లేకుండాపోతుంది. అమెరికాలోని బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీలు అపాచీ సర్వీసు కాంట్రాక్టర్లు కాగా.. బీఏఈ సిస్టమ్స్ ఎం777కు సర్వీసు కాంట్రాక్టులు చేస్తోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు