ఆమిర్ వివాహం.. కుటుంబ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సోదరుడు
Actor ProfileActor

ఆమిర్ వివాహం.. కుటుంబ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సోదరుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆమిర్ వివాహం.. కుటుంబ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సోదరుడు
Eenadu27 Aug 2026
ఆమిర్ వివాహం.. కుటుంబ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సోదరుడు

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కొన్నిరోజుల్లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ (Gauri Spratt)ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న కుటుంబ వివాదానికి ఆమిర్‌ (Aamir Khan) సోదరుడు ఫైసల్‌ ఖాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. గతంలో కుటుంబ సభ్యులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పశ్చాత్తాపపడుతున్నట్లు చెప్పారు. కుటుంబ బంధాలను తిరిగి నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైసల్‌.. ‘‘నేను అందరి కంటే ముందుగా మా అమ్మకు క్షమాపణలు చెప్పాలకుంటున్నా. అలాగే నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమిర్‌కు కూడా సారీ చెబుతున్నా. కోపం, బాధలో వారిని ఎన్నో మాటలు అన్నాను. ఈ వివాదంలో ఎవరిది న్యాయం.. ఎవరి వైపు తప్పు ఉందని నిరూపించుకోవాల్సిన సమయం ఇది కాదు. ఇప్పుడు నా దృష్టంతా కుటుంబ బంధాలను బలపర్చుకోవడంపైనే ఉంది’’ అని చెప్పారు. ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల తనలో మార్పు వచ్చిందని.. కుటుంబ బంధాల విలువ తెలిసిందని చెప్పారు. గతేడాది ఫైసల్‌ ఖాన్ తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏడాది పాటు ఆమిర్‌ (Aamir Khan) తనను గదిలో బంధించాడని.. మానసిక వ్యాధి వచ్చిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారని అప్పట్లో ఆయన ఆరోపించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు