ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Actor ProfileActor

ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Asianet News Telugu6 Sept 2026
ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ అగ్ర స్థానం వైపు దూసుకెళ్లిన హీరో సుమన్. కానీ ఒక్కసారిగా వివాదంతో ఆయన కెరీర్ పతనం అయింది. సుమన్ జీవవితంలో జరిగిన జైలు ఎపిపోడ్ అనేది ఒక పీడకల. ఆ వివాదం లేకుంటే సుమన్ కెరీర్ ఇప్పటికంటే మెరుగ్గా ఉండేది అని అంతా భావిస్తారు. అప్పట్లో సుమన్ ప్రేమ వ్యవహారాలపై కూడా గట్టిగా ప్రచారం సాగింది. సుమన్, భానుప్రియ చాలా క్లోజ్ గా ఉండేవారని పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. భానుప్రియ అంశం పక్కన పెడితే సుమన్ మరో క్రేజీ హీరోయిన్ ని కూడా లవ్ చేశారు అంటూ ప్రచారం సాగింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సుమన్ తో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. విజయశాంతి, సుమన్ ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా క్లోజ్ గా ఉండేవారట. కొంతకాలం తర్వాత సుమన్.. విజయశాంతిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. దీనిపై సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నాకు బాగా ఇష్టమైన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని ఆడియన్స్ బాగా ఇష్టపడేవారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలి అంటే నటిస్తున్నప్పుడు మాత్రమే కాదు, సెట్ లో కూడా మేమిద్దరం క్లోజ్ రిలేషన్ మైంటైన్ చేయాలి. అలా కాకుండా సెట్ లో దూరం దూరంగా కూర్చుని షాట్ రెడీ అయినప్పుడు సడెన్ గా కెమిస్ట్రీ పండించడం సాధ్యం కాదు. అందుకే క్లోజ్ గా ఉంటూ మాట్లాడుకునే వాళ్ళం. దాని వల్ల కొందరు రూమర్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. మీడియాకి ఎప్పుడూ సెన్సేషన్ కావాలి కదా అని సుమన్ అన్నారు. సుమన్ ఆ తర్వాత శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అదే విధంగా విజయశాంతి ప్రేమలో