ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా
Actor ProfilePolitician

ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా
AP7AM17 Jul 2026
ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ అభ్యర్థి, 23 ఏళ్ల నందని బోస్మియా అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 22న సాయంత్రం మె తన అద్దె ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. పోలీసులు దీనిని ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ.. ఆమెతో సహజీవనం చేస్తున్న వివాహితుడైన ప్రియుడే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.గత ఏడాది జరిగిన జెట్‌పూర్-నవగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసిన నందని ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. గొండాల్ చౌక్డీ సమీపంలోని ఆగమన్ సిటీ నివాస సముదాయంలో ఐదో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. నందని ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.శారీరక వేధింపులు - గర్భాశయ సర్జరీనందిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జునాగఢ్‌కు చెందిన అస్లాం హుస్సేన్ సమా అనే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అస్లాంకు ఇదివరకే పెళ్లయినప్పటికీ నందనితో రాజ్‌కోట్‌లో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాడు. తన మొదటి భార్యతోనూ అతడు సంబంధాలు కొనసాగించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అస్లాం ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.అస్లాం ఒత్తిడి కారణంగా నందిని తన నగలను తాకట్టు పెట్టడమే కాకుండా, చిన్న వయసులోనే గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో జునాగఢ్‌లో అస్లాం బంధువులు నందనిపై దాడి చేశారు. దీనిపై