
ఆధార్ కార్డ్ వాడుతున్న వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మీ ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఛాన్స్ ఇచ్చింది. జూలై 1 నుంచి సరికొత్త ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్‌డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ప్రస్తుతం ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవాలి అంటే రూ. 75 ఫీజు కట్టాల్సి ఉంటుంది. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. కొత్త ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వీస్ వాడుకుంటే ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఈ ఫ్రీ సర్వీస్ ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే 2026 జూలై 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ గుడ్ న్యూస్‌తో పాటే యూఐడీఏఐ మరో ఇంపార్టెంట్ అప్‌డేట్ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు మనం వాడుతున్న పాత 'ఎమ్‌ఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. అందుకే యూజర్లందరూ వెంటనే కొత్తగా లాంచ్ చేసిన 'ఆధార్ యాప్' (Aadhaar App) లోకి మారిపోవాలని అధికారులు సూచించారు. ఈ కొత్త యాప్ పాత దానికంటే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుందని, ఇందులో అదిరిపోయే అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. కొత్తగా వచ్చిన ఆధార్ యాప్‌ను డిజిటల్ ఐడెంటిటీని భద్రంగా ఉంచుకునేలా డిజైన్ చేశారు. ఇందులో ప్రైవసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. మన ఆధార్‌ను చాలా సేఫ్‌గా, ఈజీగా ఎక్కడైనా చూపించుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. హోటల్ చెక్ ఇన్ సమయంలో