ఆదాయం లేకున్నా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? 8 బెనిఫిట్స్ ఇవే
Actor ProfilePolitician

ఆదాయం లేకున్నా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? 8 బెనిఫిట్స్ ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆదాయం లేకున్నా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? 8 బెనిఫిట్స్ ఇవే- అలా పెనాల్టీ పడుతుంది
Samayam Telugu2 Sept 2026
ఆదాయం లేకున్నా ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలి? 8 బెనిఫిట్స్ ఇవే- అలా పెనాల్టీ పడుతుంది

Is ITR Mandatory if Income is Below Taxable Limit : దేశవ్యాప్తంగా ప్రస్తుతం అసెస్మెంట్ ఇయర్ 2026-27 (ఆర్థిక సంవత్సరం 2025-26) కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు ప్రక్రియ వేగంగా సాగుతోంది. చాలా మంది తమ వార్షిక ఆదాయం టాక్స్ పరిమితిలోపు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. కొన్ని పరిస్థితుల్లో మీ ఆదాయం సున్నా అయినా సరే ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. ప్రతి ఒక్కరూ ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలో, దాని వల్ల వచ్చే 8 ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టాక్స్ రిఫండ్- ఆర్థిక సంవత్సరంలో మీ జీతం లేదా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ లేదా ఇతర ఆదాయాలపై కంపెనీలు/బ్యాంకులు ముందే టీడీఎస్ కట్ చేస్తుంటాయి. ఒకవేళ మీ అసలు టాక్స్ లయబిలిటీ ఆ కట్ అయిన మొత్తం కంటే తక్కువగా ఉంటే ఆ అదనపు డబ్బును తిరిగి మీ అకౌంట్లోకి రీఫండ్ రూపంలో పొందొచ్చు. దీనికి ఐటీఆర్ ఫైలింగ్ ఒక్కటే మార్గం. ఐటీఆర్ చేయకపోతే ఐటీ శాఖ రిఫండ్ ప్రాసెస్ చేయదు. లాస్ క్యారీ ఫార్వర్డ్- మీకు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ లేదా సొంత బిజినెస్‌లో నష్టాలు వస్తే ఆ నష్టాల్ని తదుపరి సంవత్సరాల్లో వచ్చే లాభాలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో మీపై టాక్స్ భారం తగ్గుతుంది. ఈ నష్టాల్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయాలి. బ్యాంక్ లోన్ అర్హత- మీరు హోం లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ దేనికోసమైనా అప్లై చేసినప్పుడు బ్యాంకులు చాలా వరకు 2-3 ఏళ్ల ఐటీఆర్ కాపీల్ని అడుగుతుంటాయి. క్రమంతప్పకుండా ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ ఉంటే క్రెడిబిలిటీ పెరిగి లోన్ ఈజీగా వస్తుంది. ఫ్రీలాన్సర్స్, స్వయం ఉపాధి పొందే వారికి ఇది