ఆదాయం తక్కువని ఐటీఆర్ వేయట్లేదా? ఈ పొరపాటు చేస్తే నోటీసులు గ్యారెంటీ
Actor ProfilePolitician

ఆదాయం తక్కువని ఐటీఆర్ వేయట్లేదా? ఈ పొరపాటు చేస్తే నోటీసులు గ్యారెంటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆదాయం తక్కువని ఐటీఆర్ వేయట్లేదా? ఈ పొరపాటు చేస్తే నోటీసులు గ్యారెంటీ
TeluguOne13 Jul 2026
ఆదాయం తక్కువని ఐటీఆర్ వేయట్లేదా? ఈ పొరపాటు చేస్తే నోటీసులు గ్యారెంటీ

చాలా మంది తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువని, తాము ఆదాయపు పన్ను పరిధిలోకి రాలేమని భావిస్తూ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆసక్తి చూపించరు. అయితే, ఇది చాలా పెద్ద పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని రకాల లావాదేవీల వల్ల ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి గానూ ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ జోరందుకుంది. కొత్త పన్ను విధానం ప్రకారం ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.4 లక్షలుగా నిర్దేశించారు. అయినప్పటికీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఆర్థిక మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం మీ వార్షిక ఆదాయం పరిమితి కంటే తక్కువగా ఉన్నా సరే, కొన్ని లావాదేవీలు గనుక జరిగితే మీరు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. మొదటిగా, భారతదేశం వెలుపల ఏవైనా విదేశీ ఆస్తులు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించాలి. విదేశీ కంపెనీల్లో ఆర్థిక ప్రయోజనాలు లేదా షేర్లు కలిగి ఉన్నా, విదేశీ ఆస్తికి లబ్ధిదారుడిగా ఉన్నా, విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం ఉన్నా మీరు పన్ను పరిధిలోకి వస్తారు. అలాగే విదేశాల్లో స్టాక్స్, ఫారిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) లాంటి వాటిలో పెట్టుబడులు పెడితే మీ ఆదాయం ఎంత ఉన్నా ఐటీఆర్ వేయాల్సిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసిన వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఐటీఆర్ సమర్పించాలి. ఆ ఏడాది మీకు పన్ను చెల్లించే అవసరం రాకపోయినా, ఈ రూ. 2 లక్షల విదేశీ ప్రయాణ ఖర్చుల నిబంధన అందరికీ వర్తిస్తుంది. బ్యాంకింగ్ లావాదేవీల విషయానికి వస్తే ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ వద్ద ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాలలో