ఆటో డ్రైవర్ ఘరానా దందా
Actor ProfileActor

ఆటో డ్రైవర్ ఘరానా దందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆటో డ్రైవర్ ఘరానా దందా
Sakshi2 Jul 2026
ఆటో డ్రైవర్ ఘరానా దందా

ఐటీ రాజధాని బెంగళూరులో ఆటో డ్రైవర్‌ ఆగడం ఒకటి వెలుగులోకి వచ్చింది.బెంగళూరు నగరానికి మొదటిసారి వచ్చిన ఇద్దరు పల్లెటూరి యువకులను ఒక ఆటో డ్రైవర్ బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నాడనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చే పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. అసలేం జరిగింది? శాను అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎక్స్ వేదికగా ఈ షాకింగ్ ఘటనను పంచుకున్నారు. వరుస పోస్టుల్లో ఈ సంఘటన వివరాలను షేర్‌ చేశారు. దీనికి ప్రకారం ఇద్దరు టీనేజ్ యువకులు మొదటిసారి బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారు అక్కడ నుండి హోసూరు వెళ్ళవలసి ఉంది. ఆటో కోసం చూస్తుండగా..ఇతగాడు వాలిపోయాడు. రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ వారిని కలిసి, బస్ స్టాండ్ దగ్గర దింపుతానని, ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఛార్జ్ అవుతుందని నమ్మబలికాడు. అయితే ఆ యువకులకు నగరం గురించి ఏమీ తెలియదని గ్రహించిన ఆటో డ్రైవర్ వారిని దోచుకోవాలనే ప్లాన్‌ వేశాడు. ఇందులో భాగంగానే దారిలో తనతో పాటు మరో వ్యక్తిని కూడా ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై వారిని అత్తిబెలె వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆటో ఆపి, ఆ ఇద్దరు యువకుల నుండి రూ. 3,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని యువకులు చెప్పడంతో, ఆటో డ్రైవ, అతని అనుచరుడు కలిసి వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, వారిపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే బాధితులు ఎలాగోలా ఇంజనీర్ శానుకు ఫోన్ చేయగలిగారు. బాధితులు తనను కాల్‌ చేశారని, అప్పుడు అబ్యాక్‌గ్రౌండ్‌లో కేకలు, గొడవ వినబడుతుండగానే ఫోన్ కట్ అయి పోయిందనీ ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపాడు. ఇదీ చదవండి: లక్‌ అంటే వీరిదే