ఆ హీరోతో నటించాలంటే చాలా భయమేసింది.. ఆయన స్టార్ స్టేటస్ చూసి టెన్షన్ పడ్డా.. నభా నటేష్
Actor ProfileActor

ఆ హీరోతో నటించాలంటే చాలా భయమేసింది.. ఆయన స్టార్ స్టేటస్ చూసి టెన్షన్ పడ్డా.. నభా నటేష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరోతో నటించాలంటే చాలా భయమేసింది.. ఆయన స్టార్ స్టేటస్ చూసి టెన్షన్ పడ్డా.. నభా నటేష్
TV9 Telugu4 Aug 2026
ఆ హీరోతో నటించాలంటే చాలా భయమేసింది.. ఆయన స్టార్ స్టేటస్ చూసి టెన్షన్ పడ్డా.. నభా నటేష్

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాగబంధం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఆమె తన కెరీర్, రాబోయే ప్రాజెక్టులు, వివిధ సహనటులతో కలిసి పనిచేసిన అనుభవాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రధానంగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో తన తొలి సినిమా షూటింగ్ అనుభవం గురించి ఆమె మాట్లాడారు. ప్రస్తుతం నాభా నటేష్ నాగబంధం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ కథ తనని ఎంతగానో ఆకట్టుకుందని, పాత జానపద కథలను, ఫెయిరీ టేల్స్ ను గుర్తుచేస్తుందని ఆమె తెలిపారు. గతంలో ఏ చిత్రంలోనూ అన్వేషించని కొన్ని అంశాలను నాగబంధం ద్వారా చూపించనున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంతో పాటు స్వయంభు అనే మరో ఫాంటసీ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. నాగబంధం కన్నా ముందే స్వయంభుకు సంతకం చేశానని, మైథలాజికల్ లేదా పీరియాడిక్ స్పేస్ లో తనకు అదే తొలి అనుభవమని నాభా నటేష్ వివరించారు. స్వయంభు సెట్స్ లోకి అడుగుపెట్టినప్పుడు, కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు టైమ్ ట్రావెల్ చేసిన భావన కలిగిందని, ఆ వాతావరణం చాలా అందంగా ఉందని ఆమె అన్నారు. స్వయంభులో తన పాత్ర పార్వతితో పోలిస్తే చాలా భిన్నంగా, శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. స్వయంభులో తన సహనటుడు నిఖిల్ సిద్ధార్థతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఆయన చాలా సరదాగా, ప్రతిభావంతుడిగా, కష్టపడే తత్వం కలవాడు అని అన్నారు. నిఖిల్ ఎంతో అవుట్ స్పోకెన్ అని, ఎటువంటి విషయాలు దాచుకోడని, ఫుట్ బాల్, జీవితం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపుతాడని ఆమె చెప్పారు. నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా తనకు చాలా ఇష్టమని, ఆ సినిమాను పదిసార్లు చూశానని, దానిలోని కృష్ణ ట్యూన్ ఎంతో బాగుంటుందని నభా నటేష్ అన్నారు. తన వ్యక్తిగత లక్షణాల గురించి