
ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటైన ఆది గురించి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు అది ఎంత కీలకమైందో వివరించారు. ఆది సినిమా విడుదలైన తొలి షోకే ఎన్టీఆర్ స్టార్‌డమ్ స్పష్టంగా కనిపించిందని వినాయక్ తెలిపారు. నందమూరి తారక రామారావు అంశ తారక్ కే వచ్చిందని, సేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్, డైలాగ్స్ ఇతనిలో చూస్తున్నారని ఆడియన్స్ అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు. ఆది విడుదల రోజున జరిగిన ఒక సంఘటనను వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వైపు ట్రైన్‌లో షూటింగ్‌కు వెళ్తుండగా, అభిమానులు ట్రైన్‌ను కదలనివ్వకుండా ప్రతి స్టేషన్‌లోనూ ఆపేశారని చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు ఫోన్ చేసి, "అన్నా అసలు ఏంటన్నా ఇది?" అని ఆశ్చర్యపోయారని, తన కళ్ళలో నీళ్లు నిండినంత భావోద్వేగానికి లోనయ్యారని వినాయక్ పేర్కొన్నారు. చిన్న పిల్లోడు, 18-19 ఏళ్ల వయస్సులో అంత పెద్ద స్టార్‌డమ్ చూసి తను ఎంతో ప్రభావితం అయ్యాడని ఆయన అన్నారు. ఆది చిత్రాన్ని కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, అది భారీ వసూళ్లు సాధించిందని వినాయక్ తెలిపారు. ఎన్టీఆర్ కథ విషయంలో, సినిమా విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యడని అన్నారు. అలాగే ఎవరీ మాట వినడని అన్నారు. దర్శకుడిగా నటీనటులతో తన అనుబంధం గురించి వినాయక్ పంచుకున్నారు. తాను ఎప్పుడూ చొచ్చుకువెళ్లే మనస్తత్వం కాదని, హీరోల స్పేస్‌ను తాను గౌరవిస్తానని అన్నారు. వారు ఫోన్ చేస్తేనే వెళ్తానని, తనంతట తానుగా ఎప్పుడూ వెళ్ళనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభాస్‌తో తనకున్న బంధాన్ని ఉదాహరణగా చెప్పారు. ప్రభాస్ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, ఆయనకు జీరో యాటిట్యూడ్ ఉంటుందని ప్రశంసించారు. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినప్పటికీ, తన స్నేహితుల విషయంలో ఎప్పుడూ చాలా ప్రేమగా, చాలా ఇదిగా ఉంటాడని అన్నారు. తాను ఎప్పుడూ ప్రభాస్‌ను డిస్టర్బ్ చేయనని