ఆ సినిమా చాలా బోర్.. ఇంటర్వెల్ కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి
Actor ProfileActor

ఆ సినిమా చాలా బోర్.. ఇంటర్వెల్ కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి

Total News1
Movie Updates0
Sources1
ఆ సినిమా చాలా బోర్.. ఇంటర్వెల్ కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి
TV9 Telugu17 Jun 2026
ఆ సినిమా చాలా బోర్.. ఇంటర్వెల్ కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి

డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇప్పటి సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుత తరం సినిమాలు, ప్రేక్షకుల అభిరుచులు, తన రాబోయే చిత్రాల గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుత కాలంలో వస్తున్న కొన్ని కొత్త సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు. కొన్ని సినిమాలకు కూడా కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు, పిల్లల ముందు ఇబ్బందికరమైన సన్నివేశాలు రావడం వల్ల ప్రేక్షకులు అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక చిన్న సినిమా గురించి అందరూ గొప్పగా చెబుతుంటే థియేటర్‌కు వెళ్లానని, కానీ ఆ సినిమా నచ్చక ఇంటర్వెల్‌లోనే దండం పెట్టేసి వచ్చేసానని ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఒక సినిమా గురించి మాట్లాడుతూ, అందులో నటీనటులు బాగానే కష్టపడినప్పటికీ, సినిమా చూసే విధంగా లేదని , బోర్ కొడుతుందని ఇతరులు చెప్పడంతో తాను ఆ సినిమా చూడలేదని పేర్కొన్నారు. ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్.. సినిమా స్క్రీన్‌ప్లే గురించి ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఆయన వివరించారు. థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడిని సినిమా ప్రారంభమైన మొదటి 4 నిమిషాల్లో లేదా గరిష్టంగా 7 నిమిషాల లోపు కథలోకి లాక్ చేయాలని, అప్పుడే వారికి కథపై ఆసక్తి కలిగి బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పారు. ఇక తన భవిష్యత్తు చిత్రాల కోసం 'క్లెన్స్‌డ్ ఫిలిమ్స్' (Cleansed Films) అనే సరికొత్త బ్యానర్‌ను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. తన నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడూ పరిశుభ్రంగా, కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఉంటాయని చెప్పారు. ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏం పాట