
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నటుల్లో జయప్రకాష్ రెడ్డి ఒకరు. తన నటనతో , హావభావాలతో పాత్రలకు ప్రాణం పోశారు జయప్రకాశ్ రెడ్డి. కాగా జయప్రకాష్ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన పిల్లలు జీవితంలో స్థిరపడి సంతోషంగా ఉన్నారని, ఇది తనకు ఎంతో మనశ్శాంతిని ఇస్తోందని ఆయన అన్నారు. పిల్లలు తమకు సరిపోయినంత సంపాదించుకుంటూ, హ్యాపీగా జీవిస్తున్నారని, తాను వారికి ఇవ్వాల్సింది ఇచ్చేశానని చెప్పారు. జయప్రకాష్ రెడ్డి తన జీవితంలో ఎదురైన ఆర్థిక సవాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు మూడు నాలుగేళ్ళు అప్పులు తీర్చుకోవడానికే సరిపోయాయని, ఆ తర్వాత సంపాదించిందంతా కుటుంబం కోసమేనని వివరించారు. కోట్లు సంపాదించడం తన లక్ష్యం కాదని, ఉన్నంతలో సంతోషంగా ఉండటమే ముఖ్యమని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ ఒకానొక దశలో చిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపని జయప్రకాష్ రెడ్డి, తనకి మెయిన్ విలన్, హీరోయిన్ ఫాదర్ వంటి కీలక పాత్రలు లభించిన తర్వాత వన్ డే, వన్ సీన్ పాత్రలు చేయనని భీష్మించానని గుర్తు చేసుకున్నారు. అయితే, ఢీ సినిమా తన కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్ అని, ఒక్క డైలాగ్ లేకుండానే విపరీతమైన పేరు వచ్చిందని వివరించారు. ఆ తర్వాత రెడీ వంటి చిత్రాలు చేశానని, ఇప్పుడు నాలుగు రోజుల పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కబడ్డీ కబడ్డీ చిత్రం గురించి మాట్లాడుతూ, ఒక్కరోజు మాత్రమే పని చేసినప్పటికీ ఆ సినిమా తనకు సమరసింహారెడ్డి కంటే ఎక్కువ పేరు తీసుకువచ్చిందని, ఇప్పటికీ ఆ డైలాగులను గుర్తు చేసుకుని నవ్వుకుంటానని చెప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ఆనందం కూడా తనకి మంచి పేరు తెచ్చిందని పేర్కొన్నారు