
సీనియర్ నటుడు ఆనంద్ భారతి(Anand Bharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దొంగ దొంగ సినిమాలో ప్రశాంత్ తో పాటు మరో హీరోగా నటించి మెప్పించాడు సీనియర్ నటుడు ఆనంద్ భారతి(Anand Bharathi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దొంగ దొంగ సినిమాలో ప్రశాంత్ తో పాటు మరో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో హీరోగా, విలన్ గా కనిపించిన ఆనంద్.. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినిమాలే కాకుండా సీరియల్స్ లో కూడా ఆనంద్ సత్తా చాటుతున్నాడు. ప్రెజెంట్ స్టార్ మాలో ప్రసారమవుతోన్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబోలో వస్తోన్న రావు బహదూర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జులై 3 న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆనంద్.. వెంకటేష్ మహా డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, అతని ఫోటోను ప్రింట్ తీయించి బెడ్ రూమ్ లో పెట్టుకున్నట్లు తెలిపాడు. అంతలా అతన్ని అభిమానించడానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ' కేరాఫ్ కంచరపాలెం ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అదొక కావ్యం అని చెప్పొచ్చు. ఒక బెస్ట్ మూవీ. కోవిడ్ సమయంలో ఆ సినిమా చూసి.. రిమోట్ ని నేలకేసి కొట్టాను. అది నాలుగు ముక్కలు అయ్యింది. రిమోట్, రెండు బ్యాటరీలు, కవర్. మొత్తం కలిపి నాలుగు అయ్యాయి. అలా నాలుగు క్యారెక్టర్లు ఒక్కరే. అసలు ఏం చేశార్రా. అందులో ఎవరికీ డౌట్ రాకుండా.. ఒకరు హిందూ, ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లిం, ఒకరు నాస్తికుడు