
నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ ఇటీవల సినిమాలు తగ్గించారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే హీరో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం, ఆయన వ్యక్తిత్వంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ కెరీర్‌ను ప్రస్తావిస్తూ.. మహానటుడు ఎన్టీ రామారావు గారి కుమారుడిగా పుట్టడం బాలకృష్ణ అదృష్టమైతే, బాలకృష్ణ లాంటి కుమారుడు పుట్టడం ఎన్టీఆర్ అదృష్టం అని మురళీ మోహన్ అన్నారు. తండ్రిని నిత్యం స్మరించుకుంటూ, ఆయన పేరు నిలబెట్టేలా బాలకృష్ణ చేస్తున్న కృషిని కొనియాడారు మురళీ మోహన్. నటుడిగా అనేక విజయాలు సాధించిన బాలకృష్ణ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా చేస్తున్న సేవలు అపారమని మురళీ మోహన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్టీఆర్ గారు తన భార్య బసవతారకం జ్ఞాపకార్థం స్థాపించిన ఈ ఆసుపత్రికి బాలకృష్ణ అంకితభావం అద్భుతమని తెలిపారు. ఆయన కేవలం చైర్మన్ హోదాకు మాత్రమే పరిమితం కాకుండా, తరచూ ఆసుపత్రిని సందర్శిస్తారని, రోగులతో, ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్న పిల్లలతో గడుపుతారని, వారికి బహుమతులు అందించి, మానసిక ధైర్యం చెబుతారని వివరించారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ ఈ సందర్భంలో మురళీ మోహన్ ఒక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామానికి చెందిన తన సన్నిహితుడు జాస్తి బాబ్జి బంధువుల అమ్మాయి క్యాన్సర్‌తో బాధపడుతూ చావు బతుకుల్లో ఉన్నప్పుడు, వైద్యులు సైతం ఆశలు వదులుకున్నారని తెలిపారు. ఆ అమ్మాయిని బాలకృష్ణకు చెప్పి బసవతారకం ఆసుపత్రిలో చేర్పించాం.. అప్పుడు బాలకృష్ణ ఆమెను కలిసి "నీకేమీ కాదు, తగ్గిపోతుంది, మళ్లీ కాలేజీకి వెళ్లు" అని ధైర్యం చెప్పారని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. ఆతర్వాత కొన్ని రోజులకు ఆమెకు సీరియస్