ఆ వార్తలకు ఆదర్శ కుటుంబం టీమ్ చెక్ .. వెంకటేష్ మూవీ విడుదలయ్యేది అప్పుడే
Actor ProfileActor

ఆ వార్తలకు ఆదర్శ కుటుంబం టీమ్ చెక్ .. వెంకటేష్ మూవీ విడుదలయ్యేది అప్పుడే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ వార్తలకు ఆదర్శ కుటుంబం టీమ్ చెక్ .. వెంకటేష్ మూవీ విడుదలయ్యేది అప్పుడే
Asianet News Telugu2 Aug 2026
ఆ వార్తలకు ఆదర్శ కుటుంబం టీమ్ చెక్ .. వెంకటేష్ మూవీ విడుదలయ్యేది అప్పుడే

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం`(హౌస్‌ నెం 47) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న మూవీ ఇది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. చాలా రోజులుగా సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ నుంచి కేవలం ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ ఒక్కటే విడుదలైంది. అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే తాజాగా దీనిపై అనేక రూమర్లు వచ్చాయి. సినిమా విడుదల వాయిదా పడుతుందని, రీ షూట్‌ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ మధ్య `బ్లాస్ట్` మూవీ వచ్చిన నేపథ్యంలో ఇది కూడా అలానే ఉంటుందని, దీంతో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని, కొంత రీ షూట్‌ జరుగుతుందనే వార్తల వచ్చాయి. అదే సమయంలో ఓ హాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. `ఆదర్శ కుటుంబం` మూవీని గాంధీ జయంతికి విడుదల చేయబోతున్నారు. అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ సినిమాలోని హృద్యమైన, ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. సినిమాలో ఎమోషన్స్, ఎంటర్టైన్‌మెంట్‌, హార్ట్ టచింగ్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉంటాయని టీమ్ చెబుతోంది. టీమ్‌ చెబుతూ, వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శైలిలో మనసును హత్తుకునే భావోద్వేగాలు, గుర్తుండిపోయే పాత్రలు, కట్టిపడేసే హాస్యం, అర్థవంతమైన కథనం కలగలిపి, ప్రేక్షకులకు సంపూర్ణమైన సినిమా అనుభూతిని అందించడానికి `ఆదర్శ కుటుంబం హౌస్