ఆ రికార్డ్ వదిలేసుకుంటున్న రాజమౌళి.. చివరికి ఇక్కడే.. పాపం మహేష్ బాబు కష్టం అంతా వృధా
Actor ProfileCelebrity

ఆ రికార్డ్ వదిలేసుకుంటున్న రాజమౌళి.. చివరికి ఇక్కడే.. పాపం మహేష్ బాబు కష్టం అంతా వృధా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ రికార్డ్ వదిలేసుకుంటున్న రాజమౌళి.. చివరికి ఇక్కడే.. పాపం మహేష్ బాబు కష్టం అంతా వృధా
10TV Telugu2 Aug 2026
ఆ రికార్డ్ వదిలేసుకుంటున్న రాజమౌళి.. చివరికి ఇక్కడే.. పాపం మహేష్ బాబు కష్టం అంతా వృధా

Varanasi : : రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా హాలీవుడ్ టార్గెట్ చేసుకొని రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే రాజమౌళి బాహుబలి డాక్యుమెంటరీ సిరీస్ లో.. వారణాసి సినిమా మరో నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తయిపోతుంది అని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా షూటింగ్ తోనే వచ్చే ఓ రికార్డ్ ని వదిలేసుకున్నారట. వారణాసి సినిమా షూటింగ్ ఇండియాతో పాటు కెన్యా, దక్షిణాఫ్రికా, టాంజానియా, జార్జియా.. ఇలా పలు దేశాల్లో జరిగింది. ఈ సినిమా మంచు ఖండం అయిన అంటార్కిటికాలో కూడా షూటింగ్ చేయాలని ప్లాన్ చేసారు. అదే జరిగితే అంటార్కిటిలో షూటింగ్ చేయబోయే మొదటి ఇండియన్ సినిమాగా వారణాసి సరికొత్త రికార్డ్ సెట్ చేసేది. Also See : Alekhya Harika : రెట్రో శారీలో అలేఖ్య హారిక.. ఎంత అందంగా ఉందో.. ఆల్రెడీ రిలీజయిన వారణాసి గ్లింప్స్ లో.. అంటార్కిటికా లో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ పర్వతం అయిన రాస్ షెల్ఫ్ ని చూపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కథకు అంటార్కిటికాకు కూడా సంబంధం ఉందని అందరికి అర్థమైంది. దానికి తగ్గట్టు అంటార్కిటికాకు వెళ్లి షూట్ చేయాలని మార్చ్, మే లోనే ప్లాన్ చేసారు.కానీ ఆ రెండు సార్లు పలు కారణాలతో కుదరలేదు. అక్కడ షూటింగ్ కోసం మహేష్ బాబు ఫ్రాన్స్ కి వెళ్లి ఎక్కువ చలిలో, మంచు కొండల్లో షూటింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అయితే విపరీతమైన చలి, అంటార్కిటికా ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులు, అక్కడికి వెళ్లి అక్కడ షూట్ చేయడానికి అయ్యే భారీ ఖర్చు, ఆ ఒక్క షెడ్యూల్ కే ఎక్కువ సమయం అవుతుందని.. ఇవన్నీ గ్రహించి రాజమౌళి అంటార్కిటికా షూటింగ్ ని రద్దు చేసినట్టు సమాచారం