ఆ ఫ్లాప్ ప్లేయర్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఇన్.. ఇంగ్లాండ్ తో తొలి టీ20ఐకి టీమిండియా ప్లేయింగ్ 11
Actor ProfileActor

ఆ ఫ్లాప్ ప్లేయర్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఇన్.. ఇంగ్లాండ్ తో తొలి టీ20ఐకి టీమిండియా ప్లేయింగ్ 11

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ ఫ్లాప్ ప్లేయర్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఇన్.. ఇంగ్లాండ్ తో తొలి టీ20ఐకి టీమిండియా ప్లేయింగ్ 11
TV9 Telugu23 Aug 2026
ఆ ఫ్లాప్ ప్లేయర్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఇన్.. ఇంగ్లాండ్ తో తొలి టీ20ఐకి టీమిండియా ప్లేయింగ్ 11

India vs England T20I: ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో ఈ యువ విస్పోటక బ్యాటర్ టీమిండియా తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న ఓ ఆటగాడి స్థానంలో వైభవ్‌కు అవకాశం దక్కనుంది. ఐపీఎల్ ‘ఆరెంజ్ క్యాప్’ హీరో వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. మైదానంలో దిగితే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లీగ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. సీజన్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 48.50 అద్భుత సగటుతో, 237.31 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలతో పాటు ఒక సుడిగాలి శతకం కూడా ఉంది. ఈ అసాధారణ ప్రదర్శనతోనే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు.. ఐర్లాండ్ సిరీస్‌లో తప్పిన అవకాశం.. అభిమానుల్లో నిరాశ ఐపీఎల్‌లో అంతలా అదరగొట్టిన వైభవ్‌కు ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు. కోచ్ గౌతమ్ గంభీర్ తొలి మ్యాచ్‌లోనే ఈ యువ సంచలనానికి డెబ్యూ క్యాప్ ఇస్తాడని భావించినా, అది సాధ్యపడలేదు. మొదటి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత, రెండో మ్యాచ్‌లోనైనా వైభవ్‌ను జట్టులోకి తీసుకుంటారని అనుకున్నారు. కానీ, అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో అభిమానులు మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: IND vs