ఆ నంబర్ నాది కాదు
Actor ProfileActor

ఆ నంబర్ నాది కాదు

Total News1
Movie Updates0
Sources1
ఆ నంబర్ నాది కాదు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema13 Jun 2026
ఆ నంబర్ నాది కాదు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు ఎంత దగ్గరవుతున్నారో, అదే స్థాయిలో కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి అమాయకులను బురిడీ కొట్టించడం సైబర్ నేరగాళ్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా ఈ తరహా మోసగాళ్ల బారిన పడింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మీనాక్షి పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్‌ క్రియేట్ చేశారు. పలువురికి మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ విషయం కాస్తా ఈ ముద్దుగుమ్మ దృష్టికి వెళ్లడంతో ఆమె తక్షణమే స్పందించింది. తన పేరు వాడుకుని జరుగుతున్న ఈ మోసాన్ని గమనించిన మీనాక్షి, అభిమానులు ఎవరూ ఆ వలలో పడకూడదని భావించి వెంటనే అప్రమత్తం చేసింది. ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన విడుదల చేసింది మీనాక్షి. “నా పేరుతో కొందరు నకిలీ నంబర్‌ను వాడుతూ మోసాలకు తెరలేపారు. ముఖ్యంగా 76048 91175 అనే నంబర్ నుండి మీకు ఎలాంటి కాల్స్ గానీ, మెసేజ్‌లు గానీ వస్తే అస్సలు నమ్మకండి, స్పందించకండి. ఆ నంబర్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఆ నంబర్ నుండి మీకు ఏవైనా సందేశాలు వస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి.” అంటూ నెటిజన్లను, ఫ్యాన్స్‌ను అప్రమత్తం చేసింది