ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జిల నియామకం
Actor ProfilePolitician

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జిల నియామకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జిల నియామకం
Zee Telugu23 Aug 2026
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జిల నియామకం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. BJP Appointments: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావాలని.. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహం రచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను బీజేపీ నియమించింది. ఏపీలోని 28 జిల్లాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ కాషాయ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి నియమాకాలు చేపట్టినట్లు బీజేపీ తెలిపింది. సామాజిక సమతూకం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త జిల్లా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, బూత్ కమిటీల బలోపేతం, సంస్థాగత విస్తరణ, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, పార్టీ కార్యక్రమాల సమన్వయం వంటి బాధ్యతలను జిల్లా ఇన్‌ఛార్జిలు నిర్వహించనున్నారని మాధవ్‌ వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొత్త ఇన్‌చార్జ్‌లకు సూచించారు. ఇన్‌చార్జ్‌ల నియామకంలో పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమతూకం పాటించి ఇన్‌చార్జ్‌ బాధత్యలు అప్పగించారు. పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌ఛార్జిలు స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ