ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్
Actor ProfilePolitician

ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్
TeluguOne21 Jul 2026
ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి కోలుకున్న స్వప్న అనే యువతి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాక్ష్యాలతో సహా వీడియోను ఆధారంతో అసలు వాస్తవాలను బహిర్గతం చేశారు. ఇటీవల జరిగిన బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో క్యాన్సర్‌తో బాధపడి ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొంది పూర్తిగా కోలుకున్న స్వప్న అనే అమ్మాయి వేదికపైకి వచ్చి తన కృతజ్ఞతలు తెలిపింది. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఊరిలో జగన్ సార్ మా ఇంటికి వచ్చి, బాలకృష్ణ సార్‌తో మాట్లాడించి నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించారు అని ఆమె పేర్కొంది.అయితే, ఆ అమ్మాయి నోట 'జగన్ సార్' అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పిన జగన్ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, ఆయన అనంతపురానికి చెందిన అనంతపురం జగన్ అని ఆర్పీ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఆయన దశాబ్దాలుగా వీరాభిమానిగా ఉన్నారని తెలిపారు. ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా బాలయ్య చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటుంటారని వివరించారు.గతంలో అనంతపురం జిల్లాలో సదరు బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఈ